కృష్ణా జిల్లా అభ్యర్థులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-15 14:55:24

కృష్ణా జిల్లా అభ్యర్థులు

ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు రాయలసీమ ప్రాంతంలోనే ప్రజలు వస్తారు మిగతా జిల్లాలో తేలిపోతారు అని టీడీపీ నాయకులు అనుకున్నారు. అనుకున్నట్లుగానే రాయలసీమలో జగన్ పాదయత్రకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు..పాదయాత్ర రాయల‌సీమను దాటి మిగతా జిల్లాలకు పాదయత్ర చేరుకోగానే వ్యతిరేఖత వస్తుంది అనుకున్నారు.కానీ రాయలసీమలో వచ్చిన జనం కంటే మిగతా జిల్లాల్లో మూడింతల జనాలు వచ్చి జగన్ కి మద్దతు తెలిపారు.కృష్ణా జిల్లా వైసీపీకి రూపురేఖలను మార్చగా, పాదయాత్రలో అయితే టీడీపీకి రెండు షాక్ లు తగిలాయి.
 
జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కృష్ణా జిల్లాలోని విజయవాడకు చేరుకోగానే జగన్ కి తోడుగా వచ్చిన జనసంద్రోహాన్ని చూసి దుర్గమ్మ వారధి కదలడంతో, టీడీపీ నాయకులలో వణుకు వచ్చింది.టీడీపీకి కంచుకోట అయినా కృష్ణా జిల్లాలో ప్రజలు జగన్ కి బ్రహ్మరధం పట్టి టీడీపీకి షాక్ ఇస్తే, కొందరు టీడీపీ నాయకులు, సీనియర్ నేతలు కృష్ణ జిల్లాలోనే పాదయాత్రలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
 
వారు టీడీపీ సీనియర్ నేత యలమంచిలి రవి, బీజేపీ సీనియర్ నేత  మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, కృష్ణా జిల్లాలో మంచి పట్టున్న‌ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వర్ రావు, ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లాలోనే వైసీపీలో జాయిన్ అయి టీడీపీకి ఈ జిల్లాలో రెండో షాక్ ఇచ్చారు.
 
ఇది ఇలా ఉంటే కృష్ణా జిల్లాలో దాదాపుగా వైసీపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు.విజ‌య‌వాడ న‌గ‌రంలో వెస్ట్ సీటు మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ సెంట్ర‌ల్ సీటు రాధాకు ఇప్పటికే ఫిక్స్ చేసినట్టు సమాచారం. తూర్పు సీటు ఇటీవ‌లే పార్టీలో చేరిన య‌ల‌మంచిలి రవికి ఖ‌రారైంది. ఇక జ‌గ్గ‌య్య‌పేట‌ పార్టీని నమ్ముకొని ఉన్న సామినేని ఉద‌య‌భానుకు ఇవ్వొచ్చు. నందిగామ‌లో మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావే బ‌రిలో ఉంటున్నారు.
 
మైల‌వ‌రంలో వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు కృష్ణ‌ప్ర‌సాద్ కు సీటు ఇచ్చి మంత్రి ఉమకు చెక్ పెట్టారు జగన్. పెడన సీటును మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు ఇవ్వొచ్చు.తిరువూరు సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధే,గుడివాడలో వైసీపీ ఫైర్ బ్రాండ్, బాబుకు చుక్కలు చూపిస్తున్న కొడలి నాని, నూజివీడు నుండి  మేకా ప్రతాప్ అప్పారావు బ‌రిలో ఉంటారు.
 
గ‌న్న‌వ‌రంలో వంశీకి చెక్ పెట్టడానికి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుని దింపుతోంది పార్టీ అధిష్టానం...పెడన  సీటు ఇంచార్జి గా ఉన్న ఉప్పాల రాంప్రసాద్ కి  ఇచ్చే అవకాశం ఉంది. కైక‌లూరు సీటును జగన్ ఇప్పటికే ప్రకటించారు,కాపు వ‌ర్గానికి చెందిన దూలం నాగేశ్వ‌ర‌రావుకు ఆ సీటును కేటాయించారు. మైల‌వ‌రంలో, పామ‌ర్రు, తిరువూరులో లో సీట్ల కేటాయింపులో కొంచెం కన్ఫ్యూజ‌న్ ఉంది..ఇక అవనిగ‌డ్డ‌లో గ‌త రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న సింహాద్రి ర‌మేష్ కు ఇవ్వొచ్చు. సీట్లను ముందుగానే ప్రకటించడంతో వారి వారి నియోజకవర్గాల్లో తిరిగి బలాన్ని పెంచుకొనే అవకాశం వుంది. వచ్చే ఎన్నికలలో  వైసీపీ జెండాను టీడీపీ కంచుకోటలో ఎగురవేసే అవకాశం వుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.