కృష్ణం రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and krishnam raju
Updated:  2018-04-20 01:07:54

కృష్ణం రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగుదేశం చేసే దీక్ష‌ల‌పై చాలా మంది నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అస‌లు నాలుగు సంవ‌త్స‌రాలు బీజేపీతో క‌లిసి ఉండి, అమ‌రావ‌తి శంకుస్ధాప‌న‌కు 400 కోట్లు ఖ‌ర్చుచేసిన మీరు, నేడు బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు... మీరా ప్ర‌జ‌ల సొమ్మును కాపాడేది అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు ప్ర‌జ‌లు. ఇక 12 గంట‌ల దీక్ష అనేది ఎవ‌రి కోసం చేస్తున్నారో చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు... కేవ‌లం మీ మీడియాలు మీ నాయ‌కుల కోసం మాత్ర‌మే ఈ దీక్ష అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి ప్ర‌జ‌ల నుంచి. తెలుగుదేశం అధినేత పుట్టిన‌రోజును కూడా,  ఓట్ల కోసం దీక్ష లా చేస్తున్నారు అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది.
 
విజ‌య‌వాడ‌లో దీక్ష చేస్తున్న సీఎం చంద్ర‌బాబు ఎందుకు బీజేపీని ప్ర‌శ్నించి కేంద్రం నుంచి ప్ర‌త్యేక హూదా సాధించ‌లేక‌పోయింది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. తెలుగుదేశం అధినేత పై ఏపీ బీజేపీ నాయ‌కులు ఇప్ప‌టికే  ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే... ఇటు సోమువీర్రాజు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాణిక్యాల‌రావు బీజేపీ పై తెలుగుదేశం అర్దం ప‌ర్దం లేని విమ‌ర్శ‌లు చేస్తున్నారు అని  నిల‌దీస్తున్న  విష‌యం తెలిసిందే.
 
ఇక ఈ స‌మ‌యంలో మాజీ కేంద్ర మంత్రి బీజేపీ లీడ‌ర్ ప్రముఖ న‌టుడు కృష్ణంరాజు కూడా త‌న స్పంద‌న తెలియ‌చేశారు..రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేప‌ట్టిన దీక్ష వ‌ల్ల పైసా ఉప‌యోగం లేద‌ని, ఏపీకి దీనివ‌ల్ల క‌లిసి వ‌చ్చేది ఏమీ లేదు అని అంటున్నారు...రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షను కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తప్పుబట్టారు..మోదీ దీక్షను విమర్శించిన బాబు, ఈ రోజు ఎందుకు దీక్ష చేస్తున్నారు అని విమ‌ర్శించారు.
 
అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం వల్లే ఏపీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకుని మాటమార్చడం ఘోరమని కృష్ణంరాజు అన్నారు. చాలా రోజులుగా ఆయ‌న పొలిటిక్ కామెంట్లు చేయ‌లేదు ఈరోజు ఆయ‌న చేసిన పొలిటిక‌ల్ కామెంట్లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.. మొత్తానికి బీజేపీ నాయ‌కులు ఏపీలో మ‌రింత ఫోక‌స్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది తాజా ప‌రిణామాల‌తో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.