వైసీపీలోకి సీటు ఫిక్స్?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 15:12:58

వైసీపీలోకి సీటు ఫిక్స్?

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో వైసీపీలోకి ప‌లువురు ఇత‌ర పార్టీ నుంచి వైసీపీ వైపు చూస్తున్నారు...గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ వైసీపీలో చేర‌డం... ఆ త‌ర్వాత మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి విజ‌య‌వాడ‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌డం ఈ ప‌ది రోజుల్లో ప్ర‌జ‌లు చూసిందే... అయితే కృష్ణాజిల్లా పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.
 
ఇక గుంటూరు నుంచి క‌న్నా విశాఖ నుంచి మ‌రో సీనియ‌ర్ లీడ‌ర్ కూడా వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు... అయితే కృష్ణా జిల్లా పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో మ‌రో సీనియ‌ర్ లీడ‌ర్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని తెలుస్తోంది.
 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్‌ వచ్చే వారం వైసీపీలో చేరనున్నారు. ఇప్ప‌టికే ఆయన కార్య‌క‌ర్త‌లు కేడ‌ర్ తో స‌మావేశం ఏర్పాటుచేసుకుని పార్టీ త‌ర‌పున నిర్ణ‌యాలు తీసుకున్నారు....నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీలో చేరాలని యోచిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం తెలియగానే టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు.. ఆయ‌న్ని పార్టీ నుంచి చేజార్చుకోకూడ‌దు అని అనుకున్నారు మంత్రులు సీనియ‌ర్ లీడ‌ర్ ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జరిపారు.
 
గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... కృష్ణప్రసాద్‌ను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు లేదా కృష్ణా జిల్లాలో తప్పనిసరిగా సీటు ఇస్తామంటూ సీఎం నచ్చజెప్పినట్లు తెలిసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నందున ఇప్పటికిప్పుడు సీటు విషయమై నిర్ణయం తీసుకోవటానికి వీలుపడదని, జిల్లా నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఇక  జిల్లా వైసీపీ కేడ‌ర్ తో ఆయ‌న‌కు మంచి స‌త్సంబంధాలు ఉండ‌టం వైయ‌స్ ఫ్యామిలీకి గ‌తంలో వ‌సంత‌ కుటుంబానికి స‌న్నిహిత సంబంధాలు ఉండడంతో సీఎం చంద్ర‌బాబు హామీనీ వ‌సంత కృష్ణ ప్ర‌సాద్  ప‌క్క‌న పెట్టారు అని తెలుస్తోంది.
 
ఇక జ‌గ‌న్ కూడా ఆయ‌న రాక పై గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు అని తెలుస్తోంది.. ఆయ‌న‌ మైల‌వ‌రం సీటు కోరుతున్నారు అని తెలుస్తోంది..  ప్రస్తుతం మైల‌వ‌రం సీటును  మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌, కాజా రాజ్‌కుమార్ ఆశిస్తున్నారు... అయితే ఇంకా ఈ సీటు పై ఎటువంటి నిర్ణ‌యం ఫిక్స్ కాలేదు అని తెలుస్తోంది. వ‌చ్చేవారం లేదా ఈ శ‌నివారం ఆయ‌న వైసీపీలో చేర‌డానికి మార్గం సుగుమం అయింది అని చ‌ర్చించుకుంటున్నారు ఆయ‌న కేడ‌ర్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.