కేవీపై నోరు జారిన కురియ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 02:28:49

కేవీపై నోరు జారిన కురియ‌న్

ఆనాడు రెండు రాష్ట్రాల విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ ఏపీకి మొండి చెయ్యి చూపింది.. ఇప్పుడు అన్ని హామీలు తీర్చుతామ‌ని చెప్పిన బీజేపీ ఎటువంటి సాయం ఏపీకి చేయ‌కుండా నాలుగేళ్లు మిత్ర‌బంధం కొన‌సాగిస్తోంది తెలుగుదేశంతో. అయితే తాజా బడ్జెట్ తో ఏపీకి ఎటువంటి ప్ర‌యోజ‌నం క‌లగ‌లేదు, దీనిపై పార్టీల‌కు అతీతంగా క‌మ‌లం పార్టీపై వ్య‌తిరేక‌త వ‌స్తోంది... తెలుగు ప్ర‌జ‌ల‌కు - ఏపీకి ఎటువంటి కేటాయింపులు చేయ‌కుండా రాజ‌కీయ క్రీడ జ‌రుపుతోంది బీజేపీ అని ఇటు వైసీపీ కాంగ్రెస్ నాయ‌కులు కూడా మండిప‌డుతున్నారు.
 
ఇక బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జ‌రిగింది అని, ఆ తీరును నిర‌సిస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు పార్లమెంట్ లో ఆందోళ‌న చేప‌ట్టారు... రాజ్య‌స‌భ ప్రారంభం అయిన కొద్దిసేప‌టికే ఆయ‌న చైర్మ‌న్ వెల్ లోకి వెళ్లారు.. సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని రాసున్న ఫ్ల‌కార్డును ఎత్తిప‌ట్టుకుని అక్క‌డే నిల‌బ‌డ్డారు కేవీపీ.. దీనిపై డిప్యూటి చైర్మ‌న్ మండిప‌డ్డారు.
 
నిరసన విరమించి, సీట్లో కూర్చోవాల‌ని  డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ఎంత చెప్పినా కేవీపీ వెనక్కి తగ్గలేదు. దీంతో సహనం కోల్పోయిన కురియన్‌ నోరుజారారు. !! ఈయనకు ఏమైంది? పిచ్చిపట్టిందా? !! what is wrong with him and is he mad !! అని కేవీపీని ఉద్దేశించి అన్నారు. అయినా ఆయ‌న త‌న నిర‌స‌న‌ను తెలిపారు.
 
సాయం చేయ‌మ‌ని అడుగుతుంటే కేంద్రం తీరు ఇలా ఉంది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి వారి తీరుపై ప్ర‌జ‌ల నుంచి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.