చంద్ర‌బాబును బ‌య‌పెడుతున్న ఆ జిల్లా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-06-25 17:40:43

చంద్ర‌బాబును బ‌య‌పెడుతున్న ఆ జిల్లా

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత 2014లో మొద‌టి సారిగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాని క‌ర్నూల్ జిల్లాలో మాత్రం చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టు సాధించ‌లేక పోతున్నారనేది వాస్తవం. అంతేకాదు జిల్లా మ‌రో స‌రికొత్త రికార్డ్ ను కూడా సొంత చేసుకుంది. 
 
14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌స‌భ స్థానాలు ఉన్న క‌ర్నూల్ జిల్లాలో పోయిన ఎన్నికల్లో టీడీపీకి కేవ‌లం 3 అసెంబ్లీ స్థానాలు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక లోక్ స‌భ స్థానాలు రెండు ఉంటే ఆ రెండు స్థానాల‌ను కూడా వైసీపీనే సొంతం చేసుకుంది. అయితే ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు ఎంపీలు గ‌తంలో టీడీపీ నాయ‌కులు చూపించిన ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి టీడీపీ తీర్థం తీసుకున్నారు. 
 
ఇక అప్ప‌టినుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. అందులో ముఖ్యంగా మంత్రి అఖిల ప్రియ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు స‌రైన నిర్ణయం క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు తెలుగు దేశం పార్టీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేయించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ దాడి వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు నాయుడు వీరిద్ద‌రిని అమారావ‌తికి పిలించుకుని స‌ర్దిచెప్పి పంపించారు. అప్ప‌టి నుంచి మంత్రి అఖిల ప్రియ‌కు ఏవీ సుబ్బారెడ్డికి ఇంత వ‌ర‌కూ మాట‌లు లేవు.
 
దీంతో చంద్ర‌బాబు అంద‌రూ స‌ర్థుకు పోయారులే అనుకున్న స‌మ‌యంలో అఖిల ప్రియ మ‌రో చిచ్చు పెట్టి చంద్ర‌బాబు మ‌ళ్లీ క‌ర్నూల్ జిల్లావైపు చూసేలా చేశారు. రాజ‌కీయంగా అఖిల‌ప్రియ‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు దూరంగా ఉంటారు. కానీ ఫ్యామిలీ రిలేష‌న్ ప‌రంగా అంద‌రితో క‌లిసిపోతారు. 
 
అయితే ఈ రిలేష‌న్ తోనే బ‌న‌గానప‌ల్లె వైసీపీ ఇంచార్జ్ కాట‌సాని రామిరెడ్డికి కాంట్రాక్టుల‌న్ని అఖిలప్రియ అప్ప‌గిస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి స్వ‌యాన మామ కావ‌డంలో అఖిల ప్రియ ఆయ‌న‌కు ఎక్క‌వ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీంతో బ‌న‌గానప‌ల్లె టీడీపీ ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి అల‌క చెందారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తెలియ‌కుండా మంత్రి అఖిల ప్రియ కాంట్రాక్ట్ ప‌నులను కాట‌సానికి ఎలా అప్ప‌గిస్తార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక వీరిద్ద‌రి వ్య‌వ‌హారం గురించి ముఖ్యమంత్రి ద‌గ్గ‌ర వివ‌రించారు బీసీ. తాను గ‌తంలో జిల్లాలో మినీ మ‌హానాడు స‌భ‌కు హాజ‌రుకాక‌పోవ‌డాని మంత్రి ఖిల ప్రియనే కార‌ణం అని వివ‌రించార‌ట‌. 
 
ఇక తాజాగా చంద్ర‌బాబు క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్వ‌టించి ఈ విష‌యంపై చ‌ర్చించార‌ట‌. ఈ స‌మావేశంలో చంద్ర‌బాబు ఎవ్వ‌రితో గొడ‌వ పెట్టుకోకుండా పార్టీ కోసం అంద‌రు క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు. అయితే గ‌తంలో కూడా ఏపీ సుబ్బారెడ్డి గొడ‌వ వ్య‌వ‌హారంలో కూడా మీడియా ముందు ఇక నుంచి తాను ఎలాంటి గొడ‌వ‌లు పెట్టుకోన‌ని చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేస్తానని చెప్పి 24  గంట‌లు గ‌డువ‌క ముందే ఏవీ పై అటాక్ చేయించారు. అయితే బ‌న‌గానప‌ల్లెలో కూడా చంద్ర‌బాబు నాయుడు మాట‌ల‌ను గాలికి వ‌దిలేసి త‌న మామ‌కోసం కృషి చేస్తారని వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.