ప్ర‌జ‌ల ప్రాణాల‌ను లెక్క చేయ‌ని కేఈ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ke krishna murthi
Updated:  2018-08-23 03:07:55

ప్ర‌జ‌ల ప్రాణాల‌ను లెక్క చేయ‌ని కేఈ

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కాన్వాయి ఢీ కొట్ట‌డంతో ఓ బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. క‌ర్నూల్ జిల్లా సీ బెళ‌గ‌ల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బెళ‌గ‌ల్ గ్రామానికి చెందిన ఈ బాలుడు ఆడుకుంటున్న స‌మ‌యంలో డిప్యూటీ మంఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కాన్వాయ్ దూసుకువ‌చ్చి ఢీ కొట్టంది. 
 
దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికి మంత్రి ఆగ‌కుండానే వెళ్లిపోయార‌ని గ్రామ‌స్తులు మండిప‌డ్డారు. దీంతో మంత్రి తీరును నిర‌సిస్తూ గ్రామంలో ఆందోళ‌న‌కు దిగారు. ఇక పోలీసుల‌కు స‌మాచారం అందటంతో గాయ‌ప‌డిన బాలుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

షేర్ :

Comments