వారితో వైసీపీకి లాభ‌మా.? న‌ష్ట‌మా.?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:13:36

వారితో వైసీపీకి లాభ‌మా.? న‌ష్ట‌మా.?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార టీడీపీ - వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహించింది. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులై ఎక్కువ మంది కర్నూల్ జిల్లాలోనే ఫిరాయించారు... క‌ర్నూలు జిల్లాలో ఉన్న ఇద్ద‌రు ఎంపీలతో పాటు శ్రీశైలం, కోడుమూరు, క‌ర్నూలు, నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డకు చెందిన ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు...
 
క‌ర్నూలు జిల్లాలో పార్టీ ఫిరాయింపుల వ‌ల్ల వైసీపీకి న‌ష్ట‌మా..లాభ‌మా..అనే దాని పై విశ్లేషిస్తే......!! 
2014 ఎన్నిక‌ల తర్వాత ప్ర‌మాణ‌స్వీకారానికి ముందే నంద్యాల వైసీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి త‌న సొంత వ్యాపార ప్ర‌యోజ‌నాల కోసం పార్టీ ఫిరాయించారు. ఫిరాయించి నాలుగేళ్లు గడిచిన నంద్యాలలో వైసీపీ త‌ర‌పున 2019 ఎన్నికలలో ఎవ‌రు బ‌రిలో దిగుతారు అనే దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ఎస్పీవై రెడ్డి పోటీ చేసే అవ‌కాశం లేదు. కావున అక్క‌డ వైసీపికి ఎలాంటి న‌ష్టం లేదు. ఎందుకంటే టీడీపీ త‌ర‌పున ఆయ‌న అల్లుడు స‌జ్జ‌ల శ్రీధ‌ర్ రెడ్డి పోటీ చేయ‌నున్నారు. ఒక‌వేళ అనూహ్యంగా టీడీపీలో చేరిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గంగుల ప్ర‌తాప్ రెడ్డి పోటీ చేస్తే వైసీపీ చెమ‌టోడ్చాల్సి ఉంటుంది...
 
కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక వైకాపాను వీడ‌టం, ఆ పార్టీకి మంచిదే అని చెప్పుకోవ‌చ్చు. ఎందుకుంటే ఆమె పార్టీ వీడ‌టంతో, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కోట్ల సూర్యప్ర‌కాష్ రెడ్డి వైకాపా ఎంట్రీకి మార్గం సుగ‌మం అయిన‌ట్లే చెప్ప‌వ‌చ్చు. కోట్ల వైసీపీలో చేరితే మాత్రం...క‌ర్నూల్ లో మ‌రోసారి వైకాపా త‌న స‌త్తా ఏంటో చూపిస్తుంది అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు...
 
ఇక పార్టీ ఫిరాయించిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైకాపా ప‌రిస్థితి!!
ఈ ఐదు స్ధానాల్లో మూడు చోట్ల శ్రీశైలం, కోడుమూరు, క‌ర్నూలు లో కేవ‌లం వైసీపీ గుర్తుతోనే అభ్య‌ర్ధులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. నంద్యాల, ఆళ్ల‌గ‌డ్డలో మాత్రం పార్టీ ప్ర‌భావంతో పాటు, సొంత బ‌లంతో భూమా కుటుంబ స‌భ్యులు గెలిచారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మినహా మిగ‌తా మూడు అసెంబ్లీలో వైసీపీ త‌ర‌పున ఎవ‌రు పోటీలో నిలిచినా గెలుస్తార‌నే  చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ మూడు చోట్ల టీడీపీ బ‌ల‌హీనంగా ఉంద‌ని చెప్ప‌డం కంటే కూడా వైసీపీ బ‌ల‌మే ఎక్కువ అని చెప్పాలి. 
 
ఇక భూమా కుటుంబ స‌భ్యులు హ‌వా న‌డిపిస్తున్న ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల‌పై మాత్రం వైసీపీ పూర్తి స్ధాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది. నంద్యాలలో టీడీపీ తరపున భూమా బ్రహ్మానంద రెడ్డి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది...అయినప్పటికీ నంద్యాల‌లో శిల్పా మోహ‌న్ రెడ్డికి బ‌ల‌మైన క్యాడర్ ఉండడం, దానికి తోడు ఉపఎన్నికల్లో టీడీపీ ప్రజలను భయపెట్టింది అనే వార్తలు బయటకు వచ్చాయి...టీడీపీ ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో నంద్యాలలో కూడా వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉంది... 
 
ఆళ్లగడ్డలో భూమా కుటుంబం నుంచి అఖిల ప్రియ టీడీపీ తరపున పోటీకి సిద్ధంగా ఉంది...అయితే ఆళ్లగడ్డ టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది...ముఖ్యంగా భూమా అనుచరుడు సుబ్బా రెడ్డితో గొడవలు కారణంగా, వచ్చే ఎన్నికల్లో అఖిలకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి... దీనికి తోడు భూమా ఫ్యామిలీకి ప్రత్యర్థిగా ఉన్న ఇరిగల రాంపుల్లా రెడ్డి కూడా ప్రజల్లో తిరుగుతూ తన వర్గాన్ని పెంచుకుంటూ అఖిలకి, సుబ్బా రెడ్డికి దీటుగా ఎదుగుతున్నారు...గతం కంటే కూడా ఆర్థికంగా ఎదిగిన ఇరిగల రాంపుల్లా రెడ్డి వర్గం కూడా ఆళ్లగడ్డలో ప్రభావితం చేసే విధంగా తయారైంది...దింతో అఖిల ఓటమికి ఈ వర్గ విభేదాలు కూడా ఒక కారణం కావొచ్చు...
 
ఇక వైసీపీ విషయానికి వస్తే ఆళ్లగడ్డ నుంచి గంగుల నాని పోటీ చేసే అవకాశం ఉంది... గంగుల ఫ్యామిలీకి మంచి క్యాడర్ ఉంది...దానికి తోడు గంగుల నాని నిత్యం ప్రజల్లో ఉంటూ, తన బలాన్ని, పార్టీ బలాన్ని భూతు స్థాయిలో పెంచుతున్నారో...టీడీపీలో వర్గ విభేదాలు, గంగుల బలం, పార్టీ బలంతో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
 
ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా దంప‌తుల మీద ఉన్న అభిమానంతో, న‌మ్మ‌కంతో అఖిల ప్రియ రాజ‌కీయాల్లో గెలుపుకు ప్ర‌జ‌లు అవ‌కాశం ఇస్తున్నారు. కావున ప్ర‌భుత్వం యొక్క వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రంగా తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ దిశ‌గా గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి కుటుంబం ముందుకు సాగాల్సి ఉంటుంది. మొత్తానికి ఫిరాయిపుల కార‌ణంగా వైసీపీకి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌నే చెప్ప‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.