జ‌గ‌న్ వెంట కువైట్ విభాగం కో కన్వీనర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan padayatra
Updated:  2018-03-30 01:04:56

జ‌గ‌న్ వెంట కువైట్ విభాగం కో కన్వీనర్

ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అశేష జనవాహిని మధ్య ముందుకు కదులుతున్నారు...పాదయాత్రలో ఉన్న జగన్ ని కువైట్ విభాగం కో కన్వీనర్ గోవిందు నాగరాజు కలిశారు. ప్రజా సంకల్ప యాత్రకు గుర్తుగా జగన్ కి మెమొంటోను ప్రజెంట్ చేసారు గోవిందు నాగరాజు.
 
ఈ సందర్భంగా గోవిందు నాగరాజు మాట్లాడుతూ నా అభిమాన నాయకుడు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడుగా అందరి చేత జేజేలు అందుకుంటూ , ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం నా అదృష్టంగా భావిస్తున్నాను..కువైట్ లో పార్టీ పరిస్థితి, అలాగే ఆంధ్ర ప్రజలు కువైట్ లో ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది... కువైట్ లో ఉండే తెలుగు ప్రజలందరికి వైసీపీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని జగన్  భరోసా ఇచ్చారని తెలియజేసారు... 
 
జననేత ఎప్పుడు ఆయురారోగ్యలతో ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర జరగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న రాజన్న ప్రభుత్వం రావడానికి ఎంతో సమయం లేదని, 2019 లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు...ఈ అవకాశం కల్పించిన యువనేత రాజంపేట యంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, మరియు గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్ కి ధన్యవాదాలు తెలియజేసారు గోవిందు నాగరాజు..
 
కువైట్ విభాగం కో కన్వీనర్ గోవిందు నాగరాజు అంటే రాయ‌ల‌సీమ ప్రాంతంలో తెలియ‌ని వారు ఉండ‌రు.. సేవాత‌త్పురుడిగా ఆయ‌న‌కు పేరు ఉంది... పార్టీల‌కు సంబంధంలేకుండా కువైట్ లో తెలుగువారికి  సాయం చేయ‌డం ఆయ‌న‌కు తెలిసిన ప‌ని.. ఇటు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయ‌న కువైట్ లో పార్టీత‌ర‌పున యాక్టీవ్ గా ఉంటారు.. ఇటు పుట్టిన ప్రాంతంలో కూడా పార్టీ త‌ర‌పున ఎంతో సేవ చేస్తున్నారు, సాయం అడిగిన వారికి లేదు అనే గుణంలేని వ్య‌క్తి గోవిందు నాగ‌రాజు అంటారు.. కువైట్ లో తెలుగువారికి ఎటువంటి ఆపద వ‌చ్చినా నే ఉన్నా అని ఆప‌న్న‌హ‌స్తం ఇచ్చే వ్య‌క్తి గోవిందు నాగ‌రాజు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.