ఏపీలో బీజేపీ పై వ్యతిరేక పవనాలు వీస్తూనే ఉన్నాయి... అయితే పాజిటీవ్ పవనాలు ఏమీ తెలుగుదేశం వైపు వీయడం లేదు అనేది కూడా ఇక్కడ గమనించాలి అంటున్నారు సీనియర్లు.... తెలుగుదేశం బీజేపీలో మైత్రి బంధానికి కటీఫ్ చెప్పకుండా కేవలం మంత్రిమండలి నుంచి బయటకు వచ్చాను అని చెప్పడం పై ఇటు బీజేపీ తెలుగుదేశం పొలిటికల్ గేమ్ ఆడుకుంటున్నాయి అని ప్రజలు కూడా మండిపడుతున్నారు... అయితే బీజేపీ ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చినా తెలుగుదేశం ఏమి నిధులు రాలేదు అని చెయ్యి చూపుతోంది ఇక్కడ పార్టీ తరపున ఉన్న బీజేపీ నాయకులు దీనిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఇక తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ విమర్శలు చేశారు..ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాలరాసేలా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు..చంద్రబాబు నంది అవార్డు స్ధాయి నటనతో ప్రజలను ఆకట్టుకుంటూ కన్నీరు పెట్టుకోగా.. మోదీ ఆస్కార్ స్ధాయి నటనతో రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు... ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతోందని నాలుగేళ్లుగా తెలియలేదా అని కేవీపీ ప్రశ్నించారు. మొత్తానికి తెలుగుదేశం బీజేపీ ఎటువంటి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయో ఆయన తెలియచేశారు.
ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రాన్ని నిధులు ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగుతుంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాదని తెలిసి నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు... మొత్తానికి కేవీపీ అవార్డుల కామెంట్లు ఇటు తెలుగుదేశం అటు బీజేపీలో కాకపుట్టిస్తున్నాయి.
Comments