కేవీపీకి ఘోర అవ‌మానం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 01:06:40

కేవీపీకి ఘోర అవ‌మానం

కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామంచ‌ద్రరావుకు రాజ్య‌స‌భ‌లో ఘోర అవ‌మానం జ‌రిగింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆయ‌న కేంద్ర బ‌డ్జెట్ లో ఏపికి జరిగిన అన్యాయంపై ప్లకార్డుల ద్వారా నిర‌స‌న తెలియ‌జేస్తున్నారు. 
 
ఈ క్ర‌మంలో బుధ‌వారం నాడు  కేవీపి ప్లకార్డుల‌తో వెల్ లోకి వెళ్లారు. అయితే అక్క‌డి నుండి వెన‌క్కు రావాలంటూ సొంత పార్టీ  ఎంపీలు కేవీపీకి సూచించారు. అంతేకాదు కేవీపీ వెల్ లో ఉండ‌గా 256 నిబంధ‌న కింద‌ బ‌య‌ట‌కు వెళ్లాల‌ని ఆదేశిస్తామని చైర్మ‌న్  వెంక‌య్య నాయుడు హెచ్చ‌రించ‌గా చేసేదేమీలేక కేవీపీ రాజ్య‌స‌భ నుండి మ‌న‌స్తాపంతో బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. 
 
తెలుగు రాష్ట్రాన్ని ముక్క‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇప్పుడు కూడా ఏపీకి న్యాయం చేయడానికి ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డంతో పాటు.... సాక్షాత్తు తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి  చైర్మ‌న్  వెంక‌య్య‌నాయుడు కూడా డిమాండ్ ల‌ను తెలియ‌జేసేందుకు స‌హ‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.