జ‌గ‌న్ కు ఆ నాయ‌కుడు భ‌రోసా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 05:28:41

జ‌గ‌న్ కు ఆ నాయ‌కుడు భ‌రోసా ?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన స‌మ‌యంలో వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెనుక ఉన్నా నాయ‌కుల‌ను చూసిన‌ట్టు అయితే వైయ‌స్ రాజ‌కీయంగా పైకి తీసుకువచ్చిన వారు జ‌గ‌న్ వెంట వ‌చ్చారు... అయితే అప్ప‌టి వ‌ర‌కూ వైయ‌స్సార్ వెంట ఉన్నా నాయ‌కులు, ఆయ‌న ఆత్మీయులు  త‌న వారు అనుకున్న వారు చాలా త‌క్కువ సంఖ్య‌లో జ‌గ‌న్ తో ముందుకు న‌డిచారు... అయితే కాంగ్రెస్ కు ఆనాడు ఉన్నా గ్రేస్ ఫేమ్ కూడా జ‌గ‌న్ వెంట వారిని న‌డ‌వ‌కుండా అడ్డు త‌గిలింది.
 
ఇక  వైయ‌స్ పేరు  చెబితే ఆయ‌న ఆప్తులుగా మిత్రులుగా ఉండేవారు కేవీపీ అలాగే డీఎల్, సాయిప్ర‌తాప్ వీరి చెలిమి స్నేహం రాజ‌కీయంగా కొన‌సాగింది.... నాడు జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో కూడా వీరు జ‌గ‌న్ కు హిత‌వు తెలిపారు...
 
కాని వారు ఆ ప‌ద‌వుల్లో కొన‌సాగుతూ ఏపీ విభ‌జ‌న త‌ర్వాత వారి పార్టీలు మారి అడ్ర‌స్ మార్చుకుంటున్నారు, అయితే ఇటు డీఎల్ ఇప్పుడు తెలుగుదేశమా వైసీపీ అనే డైల‌మాలో ఉంటే, కేవీపీ కాంగ్రెస్ త‌ర‌పున వ‌చ్చిన రాజ్య‌స‌భ హోదాలో కొన‌సాగుతున్నారు... సాయి ప్ర‌తాప్ సైకిల్ పార్టీలో ఉన్నారు, అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో చెప్పుకోద‌గ్గ స్ధాయిలో ఉన్నా ఏపీలో మాత్రం పాతాళానికి వెళ్లిపోయింది.. దీంతో కేవీపీ కూడా తెలంగాణ టూ ఏపీకి ఆయ‌న రూటు  మార్చుతున్నారు... ఏపీకి తెలుగుదేశం చేసింది బీజేపీ ఇచ్చింది ఏమీ లేద‌ని మండిప‌డుతూ విమ‌ర్శ‌లు చేస్తున్న దాఖ‌లాలు అనేకం ఉన్నాయి.
 
అయితే ఇటు డీఎల్ , సాయిప్ర‌తాప్ వైసీపీ టీడీపీ అనే డైల‌మాలో ఉంటే, ఇటు కేవీపీ మాత్రం త‌న రాజకీయ చ‌తుర‌త‌ను చూపుతున్నారు... ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వి పూర్తి అయిన త‌ర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీకి వ‌స్తార‌ని ఆయ‌న స‌ల‌హాలు సూచ‌న‌లు జ‌గ‌న్ కు, పార్టీకి ఇవ్వ‌డానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీరోల్ పోషిస్తార‌ని లోట‌స్ పాండ్ వేదిక‌గా వార్త‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.