2019లో ఏమైనా జ‌ర‌గొచ్చు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 12:24:24

2019లో ఏమైనా జ‌ర‌గొచ్చు

కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కే.వి.పీ రామంచంద్రరావు తాజాగా  ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. పోల‌వ‌రం విష‌యంలో త‌న‌తో పాటు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మంటూ ప‌లు ఆధారాల‌తో స‌హా కేవీపీ మీడియాకు చూపించారు. 
 
ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చి జ‌గ‌న్ కు మేలు చేయాల‌నే ఆరోప‌ణ‌ల‌తో పాటు.... కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డితే జ‌గ‌న్ ఖ‌చ్చితంగా ఓడిపోతాడు అని కొన్ని ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలు  చ‌ర్చిస్తున్నార‌నే వాద‌న కూడా ఉంద‌ని,  ఇలా నా మేన‌ల్లుడు ఓడిపోవాల‌ని కృషి చేస్తున్నానుకుంటే ఎలా... నేను నా పార్టీ కోసం ప‌ని చేస్తున్నాన‌ని అన్నారు. 
 
అవాస్త‌వాల‌ను వంద‌సార్లు చెప్పి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు ఇలాంటి  ప్ర‌చారం చేయ‌డంలో టీడీపీ నేత‌లు ముందుంటార‌ని ఆయ‌న అన్నారు. కేవీపీ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌న్నీ కూడా వైయస్ జ‌గ‌న్ కోస‌మే అనే విష‌యంలో కూడా ఎలాంటి వాస్త‌వం లేద‌ని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా  రాని చంద్ర‌బాబు సీఎం కాలేదా... 2019లో ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు...ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉంటాయో హైక‌మాండ్ నిర్ణ‌యిస్తుంది.. 
 
ఏమో.... చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో విడిపోవ‌చ్చేమో...కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకోవ‌చ్చేమో..... అంటూ ప‌రోక్షంగా  పొత్తుల‌పై ఆయ‌న భిన్న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్నర‌ కాలం ఉంది కావున ముందుగానే పొత్తుల‌పై ఎవ‌రూ చెప్ప‌లేర‌ని అన్నారు. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని అన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.