న‌న్ను ఆ మంత్రి కొడుకు ప్రెగ్నెంట్ చేశాడు విపరీతంగా సన్స్ స్ట్రోక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-13 16:00:25

న‌న్ను ఆ మంత్రి కొడుకు ప్రెగ్నెంట్ చేశాడు విపరీతంగా సన్స్ స్ట్రోక్

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులను కుమారులే ప్రతిపక్ష నేతల కంటే ఎక్కువగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. గతంలో ఓ మంత్రి కుమారుడు హైదరాబాద్‌లో ఓ ముస్లిం యువతిని వేధించి అరెస్టయ్యాడు. ఆ త‌ర్వాత‌ మరో మంత్రి కుమారుడు హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారంటూ రచ్చ జరిగింది. ఇక అవన్నీ సద్దుమణిగిపోయేలోపు ఇప్పుడు మరో మంత్రి కుమారుడి ఉదంతం తెర‌పైకి వ‌చ్చి కలకలం రేపుతోంది.
 
ప్రస్తుత మంత్రివర్గంలో విపక్షంపై దూకుడుగా విమర్శలు చేస్తూ మంచి కిక్ మీద ఉండే మంత్రికి ఇటీవల కిక్ దిగిపోయేలా స్ట్రోక్ ఇచ్చాడు కుమారుడు. తండ్రి మంత్రి కాబట్టి  తాను ఏం చేసినా చెల్లుతుందనుకున్నాడేమో కానీ లవ్ ఎఫైర్లు నడిపారు. ఎన్ని నడిపారో కానీ ఒకటి మాత్రం సీరియస్ అయిపోయింది. ఆ యువతి ప్రెగ్నెంట్ కావడంతో ఎలా తప్పించుకోవాలో తెలియక కనిపించకుండా తిరగడం ప్రారంభించారు. దీంతో ఆ యువతి నేరుగా తల్లిదండ్రుల్ని తీసుకుని మంత్రి ఇంటికొచ్చి పంచాయతీ పెట్టించేసింది. సర్ది చెప్పడానికి మంత్రి కూడా తర్జనభర్జన పడాల్సి వచ్చింది. వ్యవహారం అంత తేలిగ్గా తెగలేదు.
 
పెళ్లి చేయాల్సిందేనని యువతి తల్లిదండ్రులు పట్టుపట్టారు. కొన్ని రోజుల పాటు ఈ వివాదం జరిగి వాదోపవాదాలు జరిగిన తర్వాత.. యువతి తల్లిదండ్రులు రాజీకొచ్చారు. పెద్ద మొత్తంలోనే సొమ్ము డిమాండ్ చేసి తీసుకుని సెటిల్ చేసుకున్నారట. దీంతో సెటిల్ చేసుకున్నామని సంతోష పడ్డారు.. ఈ దెబ్బతో కుమారుడ్ని ఇక్కడ ఉంచకుండా.. కొన్నాళ్ల పాటు ఉండమని వేరే దేశం పంపించేశారట.
 
కానీ సినిమా ఇంతటితో అయిపోలేదు అసలు విషయం హైకమాండ్ వద్దకు కూడా వెళ్లింది. మంత్రుల్లోనూ హాట్ టాపిక్ అయింది. బయటకు రాకుండా మ్యానేజ్ చేసుకున్నారు కాబట్టి మంత్రి ఇప్పటికి సేఫే. కానీ భవిష్యత్ లో ఈ విషయాన్ని హైకమాండ్ ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకుంటే ఇబ్బందేనని సదరు మంత్రి హైరానా పడుతున్నాడు. మొత్తానికి ఏపీ మంత్రులకు “సన్ స్ట్రోక్”లు ఎక్కువగానే తగులుతున్నాయి. బయటకు వచ్చేవి కొన్ని బయటకు రాకుండా ఆగిపోయేవి ఎన్నో..!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.