ల‌గ‌డ‌పాటి క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 05:41:50

ల‌గ‌డ‌పాటి క్లారిటీ

విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అంటే  స‌ర్వేల మాంత్రికుడిగా పేరు ఉంది... ఆయ‌న స‌ర్వేల గురించి అంద‌రూ చర్చించుకుంటారు. ఏపీలో అయితే ఆయ‌న స‌ర్వే రిపోర్టు వ‌చ్చింది అంటే చాలు, ఆ వార్త వైర‌ల్ అవుతుంది. ఇక ఇటీవ‌ల ఆయ‌న స‌ర్వే అంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
 
ఆయ‌న తాజాగా ఏపీపై స‌ర్వే చేయించార‌ని ప‌లు పార్టీల ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైరల్ అయ్యాయి.., ప్ర‌జల్లో పార్టీల‌కు, ఆయా  పార్టీల‌ అధినేత‌కు, వారి ప‌థ‌కాల‌కు  విధానాల‌కు ఉన్న ప‌ల్స్ ను తెలుసుకున్నారు అని వైర‌ల్ అయింది వార్త‌... అయితే తాజాగా ఆయ‌న ఈ స‌ర్వే పై క్లారిటీ ఇచ్చారు.. తాను ఎటువంటి స‌ర్వే చేయించ‌లేద‌ని, ప‌లానా పార్టీ మెజార్టీ సీట్లు గెలుస్తుంది అని వైర‌ల్ అవుతున్న న్యూస్ నిజం కాదు అని ఆయ‌న అన్నారు.
 
ఒక‌వేళ నిజంగా స‌ర్వే చేయించిన‌ట్లు అయితే క‌చ్చితంగా తాను తెలియ‌చేస్తాన‌ని, గ‌తంలో త‌న స‌ర్వేల గురించి ఎలా మీడియా ముఖంగా చెప్పానో అలాగే తెలియ‌చేస్తాను అన్నారు ల‌గ‌డ‌పాటి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.