మ‌రోసారి ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఇది ఫైన‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-30 11:48:49

మ‌రోసారి ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఇది ఫైన‌ల్

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ను కేంద్రం ప్ర‌క‌టించాల‌ని, ప్ర‌త్యేక హోదా 5 కోట్ల‌మంది ప్ర‌జ‌ల ఆకాంక్షని విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్నారు. అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న జిల్లాలో ప్ర‌జ‌లు ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ, ప్ర‌త్యేక‌హోదా సాధించాలి అంటే ప్రాణ త్యాగాలు, బ‌లిదానాలు చేయాల్సిన అవ‌స‌రంలేద‌ని, సామ‌ర‌స్యంగా పోరాడితే చాల‌ని ల‌గ‌డ‌పాటి ప్ర‌జ‌లకు స్ప‌ష్టం చేశారు.
 
ఏపీకి కేంద్రం ప్ర‌త్యేక హోదాను కేటాయిస్తే ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీ పూర్తి స్థాయిలో న‌ష్టాల్లో కూరుకుపోయింద‌ని ఈ న‌ష్టాన్ని స‌రిచెయ్యాలి అంటే అది కేవ‌లం ప్ర‌త్యేక హోదా వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
గతంలో తెలుగు రాష్ట్రాల‌ను విభ‌జించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఏ గ‌తి ప‌ట్టిందో ఇప్పుడు బీజేపీ నాయ‌కులు ఏపీకి ప్ర‌త్యేక హోదా కేటాయించ‌కపోతే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి కూడా అదే గ‌తి ప‌డుతుంద‌ని ల‌గ‌డ‌పాటి స్ప‌ష్టం చేశారు. తాను ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నాన‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ అధికారంలో వ‌స్తుందో ఆ స‌ర్వే వివ‌రాల‌ను ఎన్నిక‌ల‌కు ముందుగానే వివ‌రిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ల‌గ‌డ‌పాటి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.