ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌కు ఫుల్ స్టాప్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 11:23:59

ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌కు ఫుల్ స్టాప్

విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అంటే, సర్వేల‌ మాంత్రికుడు, ఆక్టోప‌స్ అని అనేక పేర్లు వినిపిస్తాయి.. నిజ‌మే ఆయ‌న చేసే స‌ర్వేలు ఆయ‌న ఇచ్చే రిపోర్టులు నాయ‌కుల ఫ‌లితాల‌ను కూడా మార్చ‌గ‌ల‌వు.. అయితే గ‌త ఎన్నిక‌ల‌కు ఆయ‌న దూరం అయ్యారు.. కార‌ణం రాష్ట్రం విడిపోతే రాజ‌కీయ స‌న్యాసం అనే ప‌ట్టువీడ‌ని ప్ర‌క‌ట‌న‌తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.. ఆ స‌వాల్ చేసిన నాయ‌కులు మీరు రాజ‌కీయాల్లో కంటిన్యూ కావాలి అని కోరినా ఆయ‌న వెన‌కంజ వేశారు... అయితే ఆయ‌న అవ‌స‌రం నేడు ప్ర‌జ‌ల‌కు, మ‌రీ ముఖ్యంగా విజ‌య‌వాడ జ‌నాల‌కు అవ‌స‌రం అని భావించారు అనే వార్త‌లు ఏపీలో వినిపిస్తున్నాయి.
 
అయితే ఇటీవ‌ల వ్యాపారాలు ప‌క్క‌న పెడితే, ఆయ‌న త‌న కుమారుడి వివాహానికి సంబంధించి ప‌లువురికి ఇన్విటేష‌న్స్ ఇచ్చారు.. ఆ స‌మయంలో జ‌గ‌న్ తో భేటీ అయ్యార‌ని, వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి.. త‌ర్వాత తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబుతో ఆయ‌న భేటీ అయ్యారు, ఆ స‌మ‌యంలో ఆయ‌న తెలుగుదేశంలోకి ఎంట్రీ ఇస్తున్నారు అని వార్త‌లు వినిపించాయి... కాని  ఆయ‌న పొలిటిక‌ల్ గా మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌డానికి సుముఖ‌త చూప‌డం లేదు అని స‌న్నిహితులు తెలిపారు.
 
తాజాగా ఆయ‌న‌కు తెలుగుదేశం రెండు ఆఫర్లు ఇచ్చింది అని తెలుస్తోంది.. మ‌రో నెల‌లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటికి సీటు క‌న్ఫామ్ చేశార‌ట, అలాగే రాజ్య‌స‌భ వ‌ద్దు అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ పార్లమెంట్ సీటు ఇస్తామ‌నే ఆఫ‌ర్ ఇచ్చారట.. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న  కేశినేనికి సీటు ఇచ్చే ఛాన్స్స్ లేదు అంటున్నారు పార్టీలో నాయ‌కులు.... అందుకే ల‌గ‌డ‌పాటికి రెండు ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ట దీనిలో ఆయ‌న ఎటువంటి ఆప్ష‌న్ చూస్ చేసుకోలేదు అని తెలుస్తోంది. మ‌రి ల‌గ‌డ‌పాటి మ‌న‌సులో ఉన్న ఆంత‌ర్యం ఏమిటో ఆ పెరుమాళ్ల‌కెరుక. అయితే ఎంపీగా వెళ్లినా, లేక ఏదైనా  పార్టీలోకి చేరినా ఆయ‌న స‌ర్వేల‌కు మాత్రం ఫుల్ స్టాప్ పెట్ట‌రు అంటున్నారు ఆయ‌న అభిమానులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.