వైయ‌స్ జ‌గ‌న్ 2019 లో ముఖ్య‌మంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

lagadapati rajgopal image
Updated:  2018-03-14 05:49:29

వైయ‌స్ జ‌గ‌న్ 2019 లో ముఖ్య‌మంత్రి

ఆంధ్రప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి  ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర  కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్‌. అదే విధంగా రాష్ట్రంలో ప్ర‌భుత్వం చేస్తున్న దుష్ట ప‌రిపాల‌న‌ను ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గ‌డుతున్నారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
 
జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర వ‌ల్ల‌ రాష్ట్ర రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఈ పాద‌యాత్రకు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెబుతున్నారు ప్ర‌జ‌లు ప‌లు స‌ర్వేలు.. ఇటీవ‌ల కొంద‌రు చేయించిన స‌ర్వేలో సైతం వైసీపీ అధికారంలోకి రావ‌డం ఖాయం అని  ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్నాయి.
 
ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ  లగడపాటి రాజగోపాల్‌కు రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న చేయించే సర్వేలు నిజం అవుతాయ‌ని ప్రజలలో మంచి నమ్మకం ఏర్పడింది...  ఇప్పుడు ఆయన మరోసారి 2019 ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనేదానిపై సర్వే చేయించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఈ స‌ర్వేలో 2019లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు అనే వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి... అయితే ఇటీవ‌ల ల‌గ‌డపాటి తాను స‌ర్వేలు చేయిస్తే క్లారిటీ ఇస్తాను అన్నారు. వెయిట్ అండ్ సీ....

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.