జ‌గ‌న్ కు జై కొట్టిన ఏపీ స‌ర్వే సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-15 12:09:28

జ‌గ‌న్ కు జై కొట్టిన ఏపీ స‌ర్వే సంచ‌ల‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌ని తేలిపోయింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌ని తీరుపై రాష్ట్ర ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నార‌ని తేలిపోయింది. అన్ని వ‌ర్గాల్లో టీడీపీ స‌ర్కార్ పై వ్య‌తిరేక‌త వెళ్లివెత్తున్నవిష‌యం మ‌రోసారి తేట‌తెల్ల‌మైయింది. 2019 సార్వాత్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం త‌ధ్యం అని స‌ర్వే స్ప‌ష్టం చేస్తున్నాయి. 
 
ఎన్నిక‌ల వేల ఏ..ఏ ప్ర‌జ‌ల మ‌నోగ‌తం ఎలా ఉంది, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్కార్ తీరుపై ఏపీ ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు.. ఏ అంశాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రాధాన్యం సంత‌రించుకుంటున్నాయి... అనే విష‌యాల‌పై ఇండియా టుడే సంస్థ స‌ర్వేనిర్వ‌హించింది. ఇక ఈ స‌ర్వే ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయం ప‌రిస్థితిను క‌ళ్ల‌కు క‌ట్టింది. ఈ నెల 8 నుంచి 12తేదిల్లో ఐదురోజుల పాటు దాదాపు 10,650 మందినుంచి స‌ర్వేను సేక‌రించారు. ఈ స‌ర్వేలో టీడీపీ పాల‌న పట్ల రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని తెలిపింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌ని కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైపు ఏపీ ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్న‌ట్లు స్ప‌ష్టం అయింది. 
 
ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన  మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, ఛ‌త్తిస్ గ‌డ్, మిజోరంల‌తో, పాటు మిగితా రాష్ట్రాల్లో కూడా జ‌గ‌న్ తో పాటు ప్రతి చోట ప్ర‌స్తుత సిఎంల కంటే ప్ర‌తిపక్షనేత‌లకె  ఎక్కువ శాతం మార్కులు వ‌చ్చాయిని వెళ్ల‌డైంది. ముఖ్య‌మంత్రి అభ్యర్థి విష‌యంలో చంద్ర‌బాబు కంటే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే  ముందంజ‌లో నిలిచారు. ఈ స‌ర్వేలో 43 శాతం మంది వైఎస్ జ‌గ‌న్ ఓటు వేశారు. అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు 38 శాతం మ‌ద్ద‌తు ప‌లికారు. చంద్ర‌బాబు కంటే వైఎస్ జ‌గ‌న్ కు 5 శాతం ఓట్లు రావ‌డం విశేషం... ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం అభ్య‌త్విత్వానికి కేవ‌లం 5 శాతం మంది మాత్ర‌మే మ‌ద్ద‌తు నిలిచారు. 
 
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం త‌ధ్యం అన్న‌ది ఆ స‌ర్వేలో వెళ్ల‌డైంది. పట్టణాలు, ప‌ల్లేలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల వైఎస్ జ‌గ‌న్ కు ఆధ‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఇండియా టుడే స‌ర్వే పేర్కొంది. అంతేకాదు అన్ని వ‌ర్గాల్లోను వైఎస్ జ‌గ‌న్ మద్ద‌తు ల‌భిస్తోంద‌ని ఆ స‌ర్వే తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రం అంతా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఆధ‌ర‌ణ త‌గ్గుతుంద‌ని అలాగే అనేక చోట్ల వ‌ర్గాలు దురం అవుతున్నాయ‌ని ఆ స‌ర్వేలో విశ్లేషించింది.
 
ప‌ట్ట‌ణాల్లో 41 శాతం వైఎస్ జ‌గ‌న్ వైపు నిల‌బ‌డ‌గా చంద్ర‌బాబుకు 39 శాతం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ 5 శాతం మంది మ‌ద్ద‌తు ఇచ్చారు. అలాగే గ్రామ‌ల్లో జ‌గ‌న్ కు 44 శాతం చంద్ర‌బాబుకు 38 శాతం ప‌వ‌న్ కు 4 శాతం ఓట‌ర్లు మ‌ద్ద‌తు తెలిపారు. అయితే అన్ని వ‌ర్గాల్లోనే చంద్ర‌బాబు కంటే జ‌గ‌న్ మెరుగైన స్థానం ల‌భిస్తుండ‌గా కీల‌మైన మైనార్టీలు కూడా వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నారని ఈ స‌ర్వేలో పేర్కొంది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.