బాబు కొత్త డ్రామా మీరే చూడండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

babu
Updated:  2018-03-20 17:52:12

బాబు కొత్త డ్రామా మీరే చూడండి

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ జీవితంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి... ఒక విధంగా ఆలోచిస్తే ముఖ్య‌మంత్రి ఒక‌రి స‌పోర్ట్ లేకుండా రాజ‌కీయ ప‌రంగా అడుగు కూడా ముందుకు వేయ‌లేర‌నే తెలుస్తోంది... 1995 లో ఉమ్మ‌డి తెలుగు ప్రాంతాల‌కు మొద‌టి సారి ముఖ్య‌మంత్రి అయ్యారు బాబు...అయితే  ఇది కూడా త‌న మామ నంద‌మూరి తార‌క రామారావు  అండ‌తో అధికారన్ని ద‌క్కించుకున్నారు బాబు... 
 
ఆ త‌ర్వాత 2004 ఎన్నిక‌ల్లో  టీఆర్ఎస్ తో క‌లిసి వెళ్లినా కానీ అధికారాన్ని ద‌క్కించుకోలేక‌పోయారు చంద్ర‌బాబు... అయితే ఇదే విష‌యాన్ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కూడా ఓ ప్ర‌ముఖ వెబ్ ఛానల్ తెలియ‌జేశారు... చంద్రబాబు ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డేలోపు ఎవ‌రితో ఒక‌రితో పొత్తు పెట్టుకుని రాజ‌కీయ ప్ర‌చారం చేస్తార‌ని, అలాచేసినా కూడా దివంగ‌త నేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేతిలో ఓట‌మి పాలు అయ్యార‌ని గుర్తు చేశారు ఆయ‌న‌...
 
అలాగే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన తర్వాత కూడా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీల‌ను సొంత‌గా కేంద్రంతో  సాధించ‌కుండా ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని నాలుగు సంవ‌త్స‌రాల పాటు మిత్ర ప‌క్షంగా కొన‌సాగారు బాబు... కేంద్రంతో మిత్ర ప‌క్షంగా ఉండి విభ‌జ‌న హామీల‌ను సాధించాడా అంటే అదీ లేదు.. చివ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి హోదా కంటే ప్యాకేజీనే మేలు అని చెప్పి కొంత‌కాలం పాటు ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను తారుమారు చేశారు... 
 
అయితే ప్ర‌తి ప‌క్షం మాత్రం రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటే కావాల‌ని వైసీపీ ప‌ట్టు ప‌ట్టింది... దీంతో ఏపీలోని మిత్ర ప‌క్షాలు కూడా వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.... అందులో భాగంగానే వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మేర‌కు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు... 
 
ఈ అవిశ్వాస తీర్మ‌నంలో భాగంగా నిన్న కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ ప్ర‌తిప‌క్షాలు సంక‌ల్ప మాన‌వ‌హారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌లు చేప‌ట్టారు... అయితే టీడీపీ నాయ‌కులు ఊహించ‌ని విధంగా ఈ మాన‌వ‌హారంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌లు  ప్రాంతాల‌లో టీడీపీ నాయ‌కులు ఇందులో పాల్గొన్నారు.. దీంతో ముఖ్య‌మంత్రి త‌న 40 సంవ‌త్స‌రాల అనుభ‌వంతో వైసీపీ నేత‌లు చేప‌ట్టిన మానవహారాన్ని కాఫీ కోట్టారు...
 
తాము కూడా పార్లమెంటులో ఎంపీలు నిర్వహిస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు... అయితే ఈ వార్త‌ను విన్న‌ ప్ర‌తీ ఒక్క‌రు చంద్ర‌బాబు ఒక‌రిని ఫాలో అవ్వ‌డం త‌ప్ప సొంతంగా ఏ ప‌ని చేయ‌లేడ‌నడంలో ఇదో పెద్ద ఉదాహ‌ర‌ణ అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు నెటిజ‌న్లు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.