మరో ఎంపీ సీటు వైసీపీలో ఫిక్స్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 03:20:10

మరో ఎంపీ సీటు వైసీపీలో ఫిక్స్..?

తెలుగుదేశం నాయ‌కులు చేసే ప‌నులు చ‌ర్య‌లు రాజ‌కీయంగా ఏపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి... పార్ల‌మెంట్ స‌మావేశాలు అయిపోయిన త‌ర్వాత, కేంద్రం వీరికి చెప్పింద‌ట.. ఏపీకి ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీ, రైల్వే జోన్ మొద‌లైన అన్నింటి పై ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌కట‌న తెలిపిందట‌.. ఏపీలో అంద‌రూ ప‌డుకున్న త‌ర్వాత లీకులు వ‌స్తున్నాయి ఆస్ధాన‌మీడియాల‌లో.
 
తెలుగుదేశం నాయ‌కులు ఆడుతున్న ఆట‌ల‌పై, వైసీపీ నాయ‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు..తాజాగా టీడీపీ ఎంపీ  తీరుపై గుంటూరు వైసీపీ నేత లావు కృష్ణదేవరాయలు మండిపడ్డారు.. తెలుగుదేశం ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పై ఆయ‌న విమ‌ర్శ‌ల అస్త్రాలు ఎక్కుపెట్టారు.. పార్ల‌మెంట్ లో ఈ మూడు సంవ‌త్స‌రాలు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉండి... ఇప్పుడు నోరు మెద‌ప‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు... ఏపీ అభివృద్ది ? గల్లా జ‌య‌దేవ్ కు ఇప్పుడే గుర్తువ‌చ్చిందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.
 
ఈ తెలుగుదేశం ఎంపీలు సైలెంట్ గా ఉండ‌టం వ‌ల్ల‌? కేంద్రం పై ఒత్తిడి తీసుకురాక‌పోవడం  వ‌ల్ల?  ఏపీకి ఎటువంటి ప‌రిశ్ర‌మ రాలేద‌ని, ప‌ట్టుమ‌ని ప‌ది మందికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఏ ఒక్క‌టైనా వ‌చ్చిందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్రం తెలుగుదేశాన్ని మోసం చేసింది, తెలుగుదేశం ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది ...కాస్త గ‌ల్లా జ‌య‌దేవ్ ఆ స్పీచ్ ను సీఎం చంద్ర‌బాబు ముందు వినిపిస్తే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన 600 హామీలు గుర్తువ‌స్తాయి అన్నారు ఆయ‌న‌.
 
రాయ‌ల‌సీమ‌లో కేంద్రం నుంచి భారీగా కాంట్రాక్టులు పొందుతూ, ఈ మూడు సంవ‌త్స‌రాలు సైలెంట్ గా ఉండి, గ‌ల్లా జ‌య‌దేవ్ ఇప్పుడు ఏపీకి న్యాయం చేయాలి అని ప్ర‌శ్నించ‌డం ఏమిటి అని అన్నారు..బాబు చాణిక్యుడిగా- అప‌ర‌మేధావిగా చెబుతారు తెలుగుదేశం నాయ‌కులు... మ‌రి కేంద్రం తో పోరాడి నిధులు తెచ్చుకోలేరా అని ఆయ‌న ఫైర్ అయ్యారు.. ఇక ఆయ‌న తాజాగా గ‌ల్లా పై ఫైర్ అవ‌డంతో, ఆయ‌న‌కు వైసీపీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లే అని, గుంటూరు ఎంపీగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న నిల‌బ‌డడం త‌థ్యం అంటున్నారు కొంద‌రు సీనియ‌ర్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.