వైసీపీలో చేరిన లింగా రెడ్డి...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-27 10:32:58

వైసీపీలో చేరిన లింగా రెడ్డి...

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌లో పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తూ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అవుతున్నారు. అధికారంలో ఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన అవినీతిని వివరిస్తూ, అయన ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో కథ రూపంలో వివరిస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారు జగ‌న్. 
 
ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఒకే మాటమీద నిలబడితే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ప్రజ‌ల‌కు ఆయ‌నంటే ఏంటో పూర్తిగా తెలిసిపోయింది. ఇక రాష్ట్రంలో నిజ‌మైన నాయ‌కుడు ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు...
 
అందుకే నాయకుల చూపు వైసీపీ పైన పడింది...దింతో రోజు ఎదో ఒక జిల్లా నుండి నాయకులు పాదయాత్రలో ఉన్న సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు...సీనియర్ నేత మహీధర్‌రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్‌లో కీలకనేతగా ఎదిగిన లింగా రెడ్డి మధుసూధనరెడ్డి,  పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్లలో పాదయాత్ర చేస్తోన్న వైఎస్‌ జగన్‌ ని కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు...ఈ చేరికతో ప్రకాశం జిల్లాలో వైసీపీ బలం పెరిగిందనే చెప్పాలి...

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.