రాజీనామాలపై కొత్త ట్విస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-17 17:06:57

రాజీనామాలపై కొత్త ట్విస్ట్

ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌న కోసం వైసీపీ ఎంపీలు త‌మ పోరాటం ఉధృతం చేసి త‌మ ప‌ద‌వుల‌కు సైతం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసింది...వైసీపీ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వైవీసుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్, మిథున్ రెడ్డి, వైయ‌స్ అవినాష్ రెడ్డి స్పీక‌ర్ కు పార్ల‌మెంట్ స‌మావేశాల చివ‌రి రోజున రాజీనామాలు స‌మ‌ర్పించి ఆరురోజుల పాటు ఏపీ భ‌వ‌న్ లో ప్ర‌త్యేక హూదా కోసం ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేశారు.
 
ఇక తాజాగా వీరి రాజీనామాల స‌మ‌యంలో స్పీక‌ర్ వీరిని కారణం అడిగారు ఎటువంటి ఒత్తిడి ప్ర‌లోభాలు చేశారా అని అడిగారు.... ప్ర‌త్యేక హూదా కోసం తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నాము అని, త‌మ‌పై ఎటువంటి ఒత్తిడి రాజీనామాల విష‌యంలో లేదు అని  తెలియ‌చేశారు.... స్పీక‌ర్ రాజీనామాల పై పున‌రాలోచించుకోమ‌ని చెప్పినా వారు రాజీనామాలపై వెన‌క్కి త‌గ్గ‌లేదు.
 
ఇప్ప‌టికే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి 10 రోజులు అయింది... అయినా వారి రాజీనామాల‌ను ఇంకా స్పీక‌ర్ ఆమోదించ‌లేదు. దీనిపై ఇప్పుడు ఏపీలో స‌ర్వత్రా చ‌ర్చించుకుంటున్నారు.. లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ వీరి రాజీనామాల పై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.... అస‌లు ఆ ప్రాసెస్ ఇంకా మొద‌లు పెట్ట‌లేదు అని అంటున్నాయి పార్ల‌మెంట్  వ‌ర్గాలు.
 
వైసీపీ ఎంపీల రాజీనామాల‌కు సంబంధించి ఫైల్ స్పీక‌ర్ వ‌ద్ద‌కు ఇంకా చేరలేదు అని తెలుస్తోంది..ఎంపీల రాజీనామా ఫైల్‌ను సెక్రటరీ జనరల్ కార్యాలయం సిద్ధం చేయలేదు. ఎప్పుడు సిద్ధం చేస్తారన్నది కూడా తెలియడం లేదు.
 
ఇక స్పీక‌ర్ వారి రాజీనామాలు ఆమోదించి  ఆ నోట్ ను ప‌రిశీలించి ఎన్నిక‌ల సంఘానికి పంపిస్తే, వారు ఆరునెల‌లోపు అక్క‌డ ఉప ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు... అయితే ఆమె ఎప్పుడు రాజీనామాలు ఆమోదిస్తారు అని అనుకుంటున్నారు. మ‌రో వైపు స‌మ‌యం ముగ‌స్తుండ‌టం వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉండ‌టంతో  ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న కేంద్రం చేయ‌దు అని అంటున్నారు మ‌రి కొంద‌రు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.