కొడాలి ప్లేస్ మార్చుకున్న‌లోకేష్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 16:22:16

కొడాలి ప్లేస్ మార్చుకున్న‌లోకేష్

వైసీపీ లో ఆయ‌న  ఫైర్ ...
ఆయ‌న ఏది మాట్లాడినా ముక్కుసూటిగా ఉంటుంది ఆయ‌న వ్య‌వ‌హారం
ఇక తెలుగుదేశం నాయ‌కుల‌ను ర‌ఫ్ఫాడించ‌డంలో ఆయ‌న రూటే స‌ప‌రేటు
 
 
ఆయ‌నే వైసీపీలో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని.. ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత ఇక్క‌డ టీడీపీ ఎన్నో ఎత్తులు వేసింది.. కౌన్సిల్ లో నాని వ‌ర్గాన్ని తెలుగ‌దేశంలోకి ఫిరాయించేలా చేశారు.. ముఖ్యంగా నానికి వెనుక ఉన్న కేడ‌ర్ ను అంతా తెలుగుదేశంలోకి వ‌చ్చేలా చేశారు.. అయితే ఇక్క‌డ నాని ఎక్క‌డా బెద‌ర‌లేదు, ముఖ్యంగా మంత్రి నారాలోకేష్ ఇక్కడ‌ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకున్నారు అని అనుకున్నారు.. అయితే రాజ‌కీయంగా నానిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎమ్మెల్యేగా ఉన్నా.
 
ముఖ్యంగా ఇప్పుడు చ‌ర్చించుకునే విష‌యం ఎన్టీఆర్ సెగ్మెంట్, కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రి నారాలోకేష్  ఇక్క‌డ పోటీ చేస్తారు అని నానిపై పోటికి ఆయ‌న రెడీ అవుతున్నారు అని వార్త‌లు వినిపించాయి.. ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డానికి ఇప్ప‌టికే స‌ర్వేలు కూడా చేయించుకున్నారు అని అంటున్నారు... అయితే ఇది పొలిటిక‌ల్ గా మంచి ర‌స‌వ‌త్త‌రంగా చ‌ర్చ‌కు తీసింది.
 
అయితే రాజ‌కీయంగా ఇప్పుడు ఇక్క‌డ మ‌రో వార్త వ‌స్తోంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంద‌రూ అనుకునేటట్లు మంత్రిగారు ఇక్క‌డ నుంచి పోటీకి సుముఖ చూప‌డం లేద‌ని, ఆయ‌న తూర్పుగోదావ‌రి లేదా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పోటీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది... ఆయన‌కు సీటు ఇవ్వ‌డానికి ఇటు కృష్ణాలో ఎమ్మెల్యే వ‌చ్చిన విష‌యం తెలిసిందే, మ‌రి ఉభ‌య‌గోదావ‌రిలో ఎవ‌రు ముందుకు వ‌స్తారో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.