లోకేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 16:28:17

లోకేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ మ‌రోసారి మీడియా స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... గ‌తంలో  ప్లీన‌రీ సాక్షిగా మంత్రి లోకేశ్ అవినీతి ప‌రుడ‌ని, త‌న ద‌గ్గ‌ర ఆధారాల‌తో స‌హా ఉన్నాయ‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ఈ ఆరోప‌న‌ల‌పై లోకేశ్ మీడియా ద్వారా విరుచుకుప‌డ్డారు...శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... తనపై పవన్ చేసిన ఆరోపణలను ఆయనకే వదిలేస్తున్నానని అన్నారు...  తాను అవినీతి ప‌రుడుకాద‌ని, త‌న తండ్రి రాజ‌కీయ బాట‌లోనే తాను నిత్యం కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు... ఒక వేళ తాను అవినీతికి పాల్ప‌డిన‌ట్లు అయితే ప‌వ‌న్ సాక్షాల‌తో స‌హా నిరూపించాలని తెలిపారు.... నీచ రాజకీయాలు చేసే చరిత్ర టీడీపీది కాదని స్ప‌ష్టం చేశారు.
 
దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని లోకేశ్ అన్నారు..  తమ పోరాటం ఇంత‌టితో ఆగ‌ద‌ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేంత వ‌ర‌కూ తాము ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోరాటం చేస్తూనే ఉంటామ‌ని స్ఫ‌ష్టంచేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.