ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు మంత్రి లోకేశ్.... 40 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న తండ్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా రాజకీయంగా అడుగులు పైకి వేస్తున్నారు లోకేష్... ఇక ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ లోకేష్ పై బాబు పై ఫోకస్ చేస్తోంది... వీరిద్దరి పై విమర్శల దాడి మరింత పెంచింది... ఇటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాటలు కూడా విమర్శల కోటలు దాటుతున్నాయి... ఈ విమర్శలకు అడ్డుకట్ట పడటం లేదు, దీంతో పార్టీ తరపున ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అని, దీని వల్ల నెల రోజులుగా పార్టీ మైలేజ్ తగ్గిపోయింది అనే బాధ ఉంది పార్టీలో.. నిరంతరం పార్టీ గ్రాఫ్ పడిపోతూనే ఉంది తెలుగుదేశానికి.
ఇప్పుడు తాజాగా లేఖల వార్ జరిగింది ఇటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి మరియు సీఎం చంద్రబాబు నాయుడికి.. ఏపీకి అన్ని ఇచ్చాం అని అమిత్ షా చెప్పడం,చంద్రబాబు నిర్ణయంలో అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని షా లేఖలో మండిపడ్డారు. ఏపీ హక్కులను పరిరక్షించడంలో బీజేపీ ముందుంటుందని, ప్రజల్లో బీజేపీకి సానుభూతి లేదన్న చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలని లేఖలో చెప్పుకొచ్చారు.. దీని పై తెలుగుదేశం నాయకులు ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తున్నారు.
బీజేపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లారో అనేలా అమిత్ షా లేఖలో పేర్కొనడం పై, ఇటు మంత్రి నారా లోకేష్ బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై అమిత్ షాకు ఏ మాత్రం అవగాహన లేదని, కనీస సమాచారం లేకుండా ఆయన ఏవేవో మాట్లాడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు.
రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిందని, అభివృద్ధి ఎజెండాతో కాదని అమిత్ షా అనడం విడ్డూరంగా ఉంది... రాష్ట్రంలో జరిగిన అన్ని పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు యూసీ సర్టిఫికేట్లను కేంద్రానికి పంపుతూవచ్చాం. అయినా యూసీ సర్టిఫికేట్కు ప్రత్యేక హోదాకు సంబంధమేంటి? ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని 18 హామీల అమలుకు యూసీ అవసరమా? అని లోకేశ్ ప్రశ్నించారు.
ఎన్డీయే నుంచి కావాలి అని ఆవేశపూరితంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు ఆయన.. ప్రత్యేక హూదా అవసరం ప్రజలకు తెలిసేలా మా కేంద్ర మంత్రులను ఇరువురిని బయటకు తీసుకువచ్చాము అని ఆయన తెలియచేశారు....అమిత్ షా చేసిన ఆరోపణలకు అన్నింటికి సాక్ష్యాలతో సహా సీఎం చంద్రబాబు నాయుడు మరో లేఖ రాస్తారు అని తెలియచేశారు మంత్రి నారా లోకేష్.
Comments