టీడీపీలో చిన‌బాబు పెద్ద‌చిచ్చు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-12 17:36:38

టీడీపీలో చిన‌బాబు పెద్ద‌చిచ్చు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాంగంగా బుట్టారేణుక‌ను అలాగే ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డిని వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. వాస్తవానికి చంద్ర‌బాబు నాయుడు ఇలా ఇష్టానుసారంగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌రు. ఆయన‌ వ్య‌వ‌హార శైలి ఎలా ఉంటుందంటే తాను పోటీ చేసే కుప్పం నియోజ‌క‌వ‌ర్గం పేరును కూడా చివ‌రి జాబితాలో చేర్చేవారు. 
 
అంతే కాదు గ‌తంలో టికెట్ల కేటాయింపు అంతా పార్టీలో ఏకాభిప్రాయంతో జ‌రిగేది. ఏకాభిప్రాయం అంటే చంద్ర‌బాబు నాయుడి అభిప్రాయం వార్త‌లు వ‌చ్చేవి. అయితే ఇప్పుడు పార్టీలో లోకేశ్ మాటే ఫైన‌ల్ అన్న ప‌రిస్థితి నెల‌కొంటుంది.పార్టీ సీనియ‌ర్లు చంద్రబాబు వద్ద ఏవైనా అంశాల‌ను ప్ర‌స్తావిస్తే లోకేశ్ బాబుకు ఒక మాట చెప్పాల‌ని వ్యాఖ్యానిస్తున్న‌ట్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌లే ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు.  అయితే ఇప్పుడు క‌ర్నూల్ జిల్లాలో లోకేశ్ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన పార్టీ నేత‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు పంపుతుంద‌ని టీడీపీ నేత‌లే అంగీక‌రిస్తున్నా బ‌య‌ట‌కు మాత్రం చెప్పుకోలేక పోతున్నార‌ట‌. పార్టీ నేత‌ల అభిప్రాయాలు ఎలా ఉన్నా టికెట్లు కావాల‌ని కోరుకునేవారంత చంద్ర‌బాబును వ‌దిలేసి లోకేశ్ చుట్టు తిర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 
 
ఇప్ప‌టికే అతిపెద్ద ప‌వ‌ర్ సెంట‌ర్ గా మారిన లోకేశ్ రాబోయే రోజుల్లో మ‌రింత కేంద్రికృత వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోనున్నారు. సీనియ‌ర్లు అన్న‌వారిని ప‌క్క‌న పెట్టి త‌న మాట వినేవారికి లోకేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రాధాన్య‌త ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో మంత్రుల‌కు అపాయింట్మెంట్ ఇవ్వ‌కుండా వెయిట్ చేయించిన లోకేశ్ ఇక ఇప్పుడు టికెట్లు ఖ‌రారు చేసే ప‌రిస్థితికి వ‌చ్చార‌ని పార్టీ రాజ‌కీయాలు ఎటువైపు మారుతాయే చూడాల్సిందే అంటున్నారు సీనియ‌ర్లు. 
 
అయితే లోకేశ్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా అంత ఆషామాషిగా చేశార‌ని అనుకోవ‌డానికి లేద‌ని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దేశంలో లేని వేళ‌ ఇక ముందు పార్టీ వ్య‌వ‌హారాల‌న్ని త‌న కంట్రోల్లోనే ఉంటాయ‌నే ఇండికేష‌న్  కోసం ఓ ట్రైల్ ర‌న్ వేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏది ఏమైనా టీడీపీలో పెద‌బాబు స్థానాన్ని చిన‌బాబు భ‌ర్తి చేయ‌బోతున్నార‌ని పార్టీ నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.