వైసీపీ రెడీ మ‌రి లోకేష్ వెన‌క‌డుగు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp
Updated:  2018-06-28 10:53:32

వైసీపీ రెడీ మ‌రి లోకేష్ వెన‌క‌డుగు

మామా అల్లుడు అంటే ఆనాడు తెలుగుదేశంలో ఎన్టీఆర్, చంద్ర‌బాబు, ఇప్పుడు మామ అల్లుడు అంటే మంత్రి లోకేష్ ఎమ్మెల్యే బాల‌య్య.. ఇటు రాజ‌కీయాల్లో న‌వ‌ర‌స హాస్యాన్ని పండించ‌డంతో వారు ఇద్ద‌రూ పోటీ ప‌డ‌తారు అని అంటారు అంద‌రూ..అయితే కార‌ణాలేమైనా బాల‌య్య స్పీడు లోకేష్ జోరు రాజ‌కీయంగా తెలుగుదేశానికి బాగా ప్ల‌స్ అవుతోంది..అయితే ఇటు తెలుగుదేశం కేడ‌ర్ లో మాత్రం మాంచి జోష్ ని నింపుతున్నా, బయ‌ట ప్ర‌చారం ఎలా జ‌రుగుతుందో వారికి తెలియ‌డం లేదు.. ఇటు డ్యాష్ బోర్డు సొంత నాయ‌కులు, అనుకూల మీడియాలు చెప్పేది నిజ‌మో అసత్య‌మో వారికి తెలిసిందే.
 
ఇక హాస్య చ‌తుర‌త‌లో ఇద్ద‌రు ఒక‌రిని మించి మ‌రొక‌రు హాస్యాన్ని రాజ‌కీయంగా పంచుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.. ఇటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి అయినా పోటీ చేస్తాను అని చెప్పిన మంత్రి లోకేష్, వెంట‌నే స‌వ‌రించుకుని, 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో హిందూపురం మిన‌హా ఎక్క‌డ నుంచి అయినా పోటీ చేస్తాను అని చెప్పారు.. అందులో కుప్పం కూడా ఉంది మ‌రి నాన్న‌గారి సీటు అదే సీఎంగారి సీటు పై కూడా ఆయ‌న‌కు ఆశ‌లు ఉన్నాయి అని తెలిసిపోయింది.
 
ఇక పెద్ద జోక్ ఏమిటి అంటే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే తాము బీజేపీతో క‌లిసి వెళ్ల‌ము అని అన్నారు.. అయితే అన్నీ అసెంబ్లీలు దీనికి ఒప్పుకోవు, పైగా డిసెంబ‌ర్ లో ఎన్నిక‌లు అంటే ఆరు నెల‌ల ముందుగానే ఎన్నిక‌ల్లోకి రావాలి.. పోటీ చేయాలి అన్నా సంసిద్దంగా మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ త‌ర‌పున‌ ఒప్ప‌కోరు... అలాగే గ‌తంలో  ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబు కోట‌రి వెళితే ఏమైందో తెలిసిందే.
 
అయితే ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ ఆ ఛాన్స్ వ‌దిలే ప్ర‌స‌క్తేలేదు...మ‌రి ఇటు లోకేష్ కూడా అధికార పార్టీలో ఉండి... తాము ముంద‌స్తుకు అయినా రెడీ అనాల్సింది పోయి, తాము ప్ర‌జా తీర్పుని గౌర‌విస్తాం అంటున్నారు.. అయితే గౌర‌వం అన్నింటా ఉండాలి.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీ ఫిరాయించేలా చేసిన స‌మ‌యంలో, ఇలా ఎందుకు గౌర‌వం గురించి మాట్లాడ‌లేదు అని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది. మంత్రి వెన‌క‌డుగు వెనుక నిజం ఏమిటో, వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలియాల‌ట‌..?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.