రిచ్‌గా నోరు జారిన మంత్రి లోకేష్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:48:17

రిచ్‌గా నోరు జారిన మంత్రి లోకేష్‌

ఏపీలో తెలుగుదేశం నాయ‌కులు ఒక‌రికి ఒక‌రు బాగా ఫేమ‌స్ అవుతున్నారు... పార్టీ  సిద్దాంతాలు, పార్టీ విధానాల విష‌యంలో కాదు, ప‌రిపాల‌న‌లో కొత్త ప‌థ‌కాలు తీసుకు వ‌చ్చీ కాదు... టంగ్ స్లిప్ అయ్యి ఏదో విధంగా ముందుకు వెళుతున్నారు.. ఇక మంత్రి నారా లోకేష్ ఈ జాబితాలో ముందు ఉంటున్నారు... నాడు తెలుగుదేశం నాయకులు అంద‌రూ ఉన్న స‌భ‌లో కుల‌పిచ్చి మ‌త‌పిచ్చి డ‌బ్బు పిచ్చి ఉన్న పార్టీ తెలుగుదేశం మాత్ర‌మే అని ఆయ‌న బ‌హిరంగంగా అనేస‌రికి ఎవ‌రూ ఏమీ స‌ర్దిచెప్ప‌లేక‌పోయారు. ఇక తెలుగుదేశానికి ఓటు వేస్తే ఉరివేసుకున్న‌ట్లే అని ఆ కామెంట్ ఇంకా వైర‌ల్ అవుతూనే ఉంది.
 
ఇక అంబేద్కర్ వర్థంతికి శుభాకాంక్షలు చెప్పారు... ఇది మ‌రింత ఫేమ‌స్ అయ్యింది.. త్రాగునీటి స‌మ‌స్య లేకుండా చేస్తాను అన‌బోయి . నీటి ఎద్దడి గ్రామాలను తయారు చేస్తానని ఓ స‌వాల్ విసిరేసారు.. ఇలా ప‌రిప‌రివిధాలుగా అనేక‌సార్లు ఆయ‌న త‌న తెలుగును ప్ర‌ద‌ర్శిస్తున్నారు.
 
ఇక మంత్రిగా ఆయ‌న స‌భ‌లో ఎటువంటి స్పీచ్ఇస్తారా అని అంద‌రూ ఎదురు చూసే స్దితికి ఆయ‌న చేరుకున్నారు. ఇక తాజాగా ఆయ‌న ఇచ్చిన స్పీచ్ మ‌ర‌లా న‌వ్వులు పాలైంది...  నా పై వస్తున్న అవినీతి ఆరోపణల్లో !! అవాస్తవం !!లేకపోయినా కొందరు బురద జల్లుతున్నారంటూ వ్యాఖ్యానించారు.. అయితే ఇక్క‌డ ఆయ‌న అన‌వ‌ల‌సింది అవినీతి ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదు అని అనాలి... కాని ఆయ‌న ఆ మాట అన‌కుండా అవాస్త‌వం అని అన్నారు.. ఇక త‌ర్వాత స‌వ‌రించుకున్నా లైవ్ లో అప్ప‌టికే ఎయిర్ అయిపోయింది అదీ సంగ‌తి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.