ఏపీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై లోకేశ్ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 01:50:06

ఏపీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై లోకేశ్ క్లారిటీ

ఇటు తెలంగాణ‌తో పాటు ఇటు ఏపీలో కూడా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా సాగుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌పాలంటూ క‌స‌ర‌త్తు చేస్తున్న నేప‌థ్యంలో ఏపీలో కూడా ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు ఈ ముంద‌స్తు ఎన్నిక‌లపై ఓ ప్ర‌ముఖ జాతీయ మీడియా ప‌త్రిక తెలిపింది. 
 
అయితే ఈ వార్త‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు ఐటీ గ్రామీణాబివృద్ది శాఖా మంత్రి నారి లోకేష్ స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎట్టి ప‌రిస్థితిలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌వ‌ని అన్నారు. తెలుగురాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత 2014లో మొద‌టి సారిగా ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని ఇది  ఓ చ‌రిత్ర అని అన్నారు. ప్ర‌జ‌లు త‌మ‌ను 5 సంవ‌త్స‌రాలు పాలించ‌మ‌ని అధికారాన్ని ఇచ్చార‌ని వారి న‌మ్మ‌కన్ని వ‌మ్ము చెయ్య‌మ‌ని అన్నారు. 
 
అస‌లు త‌మ‌కు ముంద‌స్తు ఎన్నిక‌లు ఆలోచ‌న లేద‌ని అన్నారు. ఏపీలో పూర్తి ప‌రిపాల‌న చెయ్యాల‌నే త‌మ సెంటిమెంట్ అని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. అయితే తెలంగాణ‌లో ఇలా జ‌రుగ‌డం విచార‌క‌రం అని లోకేశ్ త‌నసానుభూతిని