రాజ‌కీయ తెర‌వెనుక లోకేశ్ అదిరిపోయే ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-24 17:59:35

రాజ‌కీయ తెర‌వెనుక లోకేశ్ అదిరిపోయే ప్లాన్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ స‌రికొత్త ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో మొద‌టిగా మెగా ఫ్యామిలీని లోకేశ్ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 2014లో హోరా హోరీగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అధిన‌తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పొత్తు పెట్టుకునిఅధికారంలోకి వ‌చ్చార‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఇప్ప‌టికి భావిస్తున్నారు.
 
పొత్తులో ఉన్న‌ప్పుడు మంత్రి లోకేశ్ ప‌వన్ క‌ళ్యాణ్ త‌న‌కు అన్న‌లాంటివాడ‌ని ఆయ‌నంటే త‌న‌కు ఇష్టం అని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లీన‌రి సాక్షిగా మంత్రి లోకేశ్ అవినీతి బండారాన్ని స‌భా ముఖంగా బ‌ట్ట బ‌య‌లు చేశారు. కానీ అప్పుడు కూడా లోకేశ్ రియాక్ట్ కాకుండా ప‌వ‌న్  అంటే త‌న‌కు చాలా గౌర‌వం అని, అభిమానం అని అలాంటి వ్య‌క్తి తాను అవినీతి చేస్తున్నాన‌ని చెప్తుంటే బాదేస్తుంద‌ని ఈ మ‌ధ్య‌కాలంలో లోకేశ్ త‌ర‌చు ఇలాంటి విమ‌ర్శ‌లే చేశారు.
 
ఒక వైపు ప‌వ‌న్ స‌భా ముఖంగా లోకేశ్ పై ఆయ‌న తండ్రి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నా కూడా లోకేశ్ స్పందించ‌కుండా ప‌వ‌న్ మంచోడు త‌న‌కు అన్న లాంటి వాడు ఆయ‌నంటే త‌న‌కు గౌర‌వం అంటూ సినిమా డైలాగ్ లు కొట్టుకుంటు వ‌చ్చారు
 
అయితే ఇదే క్ర‌మంలో ప‌వ‌న్ త‌న అన్న మెగాస్టార్ చిరంజీవి ఆగ‌స్టు 22 వ తేదిన పూట్టిన రోజు వేడుక‌లు జ‌రిగాయి. ఈ  వేడుక‌లును మెగా అభిమానులు ఘ‌నంగా సెబ్రెట్ చేసుకున్నారు. అయితే ఈ క్ర‌మంలో చిన‌బాబు కూడా సోష‌ల్ మీడియాను వేధిక‌గా చేసుకుని చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు మంత్రి చిన‌బాబు. ఆయ‌న సినిమా హీరో కాబ‌ట్టి శుభాకాంక్ష‌లు తెలుప‌డం త‌ప్పేమి కాదులే అని అనుకుంటే ప‌ప్పులో కాలు వేసినట్లే. 
 
లోకేశ్ ట్వీట్ వెనుక భారీ స్కెచ్ ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో మెగా స్టార్ కు శుభాకాంక్ష‌లు తెలిపి అభిమానుల ఓట్ల‌ను అలాగే ఇత‌ర హీరోల అభిమానుల ఓట్ల‌ను దీంతో పాటు కాపు ఓట్ల‌ను రాబ‌ట్టాల‌నుకున్నారో ఏమో తెలియ‌దు కానీ ఈ ట్వీట్ వెనుక భారీ స్కెచ్ ఉంద‌ని తెలుస్తోంది. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన‌బాను తిట్టిపారేసినా కూడా చిన‌బాబుకు మెగా ఫ్యామిలీ మీద ఇంత అపార‌మైన ప్రేమ చూపిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.