ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై లోకేష్ ఏమ‌న్నారంటే..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nara lokesh image
Updated:  2018-03-15 18:23:54

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై లోకేష్ ఏమ‌న్నారంటే..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పార్టీ ఆవిర్బావ దినోత్స‌వంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఆయ‌న కుమారుడు మంత్రి లోకేష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే... రాష్ట్రంలో తండ్రి కోడుకులు ఏవిధంగా పాల‌న సాగిస్తున్నారో త‌న‌కు తెలుస‌ని అన్నారు...అంతేకాకుండా అధికారం అండ చూసుకుని వారు చేస్తున్న క‌ర‌ప్ష‌న్ ను ప‌వ‌న్ ప్లీన‌రీ సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లు చేశారు... మంత్రి లోకేష్ అవినీతిపై ఆయ‌న ప్ర‌శ్నించారు..ఆ అవినీతి  మీకు తెలుసా అని అన్నారు ప‌వ‌న్. 
 
ఇక ఈ వ్యాఖ్య‌ల పై సీఎం చంద్ర‌బాబు నాయ‌కుల‌కు తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ల‌కు, ప‌వ‌న్ పై ఎటువంటి కామెంట్లు చేయ‌వ‌ద్ద‌ని అన్నారు... అయితే ఇటు సీఎం చంద్ర‌బాబు చెప్పిన విధంగా కొంద‌రు మాత్ర‌మే ఉన్నారు, ఎక్క‌డ మీడియా దొరికితే అక్క‌డ తెలుగుదేశం  నాయ‌కులు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేశారు.. ఇటు జ‌లీల్ ఖాన్, మంత్రి  ఆదినారాయ‌ణ రెడ్డి అంద‌రూ ఫైర్ అయ్యారు జ‌న‌సేనానిపై .. అలాగే రాజ‌కీయాల్లో నేరుగా కౌంట‌ర్ల‌కు స్పంద‌న ఉండ‌దు అనేది తెలిసిందే... ఖండ‌న అనేది జ‌రుగతుంది వారి వెర్ష‌న్ తెలియ‌చేస్తారు.
 
ఇక నేడు జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రి లోకేష్  కాస్త  ప‌వ‌న్ పంచ్ ల‌కు కౌంట‌ర్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు.. సీఎం చంద్ర‌బాబు ప‌ని ఎవ‌రూ చేయ‌లేర‌ని, సీఎం పై ప్ర‌శంస‌లు కురిపించిన లోకేష్ ..తన తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబులకు మంచి పేరు తాను తీసుకురాకపోయినా... చెడ్డ పేరు మాత్రం తీసుకురానని అన్నారు స‌భ‌లో.. అయితే ఏనాడు ఇటువంటి కామెంట్ చేయ‌ని లోకేష్ నిన్న ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌కు బ‌దులు ఇచ్చారు అని అంటున్నారు తెలుగుత‌మ్ముళ్లు.. ఎన్టీఆర్  ఇంట పుట్టిన మ‌నువ‌లు ఏమి చేస్తున్నారు అని నిల‌దీసినందుకు ఇటువంటి కామెంట్లు రీ కౌంట‌ర్లు ఇచ్చారు అని అంటున్నారు నాయ‌కులు.. మ‌రి లోకేష్ కూడా కాస్త పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ వాడుతున్నారు అని రుజువు అవుతోంది అట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.