పవన్ కళ్యాణ్ ని కడిగిపారేసిన లోకేష్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

lokesh
Updated:  2018-03-20 07:15:49

పవన్ కళ్యాణ్ ని కడిగిపారేసిన లోకేష్...

నాలుగేళ్ళ పాటు టీడీపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనాని... గుంటూరులో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో టీడీపీని కడిగిపారేశారు...ఈ సభలో చెన్నై చెందిన శేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని, శేఖర్ రెడ్డి అవినీతిలో లోకేష్ కి కూడా భాగం ఉందని ఆరోపణలు చేసారు జనసేనాని...అంతేకాకుండా మీడియాతో మాట్లాడిన పవన్ ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వాలకు మార్కులు వేశారు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప‌ది మార్కుల‌కు తాను ఆరు మార్కులు వేస్తానని, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేవ‌లం రెండున్నర మార్కులు మాత్ర‌మే వేస్తానని చెప్పారు జనసేన అధినేత...
 
తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై లోకేష్ ఘాటుగా స్పందించారు...పవన్ నాపై దుమ్మెత్తి పోస్తే నేను దులుపుకోవాల్సిన అవసరం నాకు లేదు...మీరు తప్పుడు ఆరోపణలను చేస్తుంటే దానికి నేను స్పందించాలా అంటూ కోపంతో ఊగిపోయారు...మొదటి రోజు నాకు శేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని చెప్పారు...ఒక్కరోజుకే మాట మార్చారు...అసలు ఆధారాలు ఉంటె మాట ఎందుకు మార్చారు..మీరు భయపడుతున్నారా అంటూ పవన్ ని ఎదురు ప్రశ్నించారు లోకేష్ ...
 
మా తాతకు చెడ్డపేరు తెస్తున్నాని చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయని చెప్పారు లోకేష్....నేను పుట్టే నాటికే మా తాత సీఎంగా ఉన్నారు....నిరంతరం కష్టపడుతున్న సరే సీఎంకి మార్కులు వేస్తారా...ఎప్పటికి అప్పుడు ఆస్తులను ప్రకటిస్తూనే ఉన్న నాపై ఆరోపణలు చేస్తారా, ఇలాంటి తప్పుడు ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు అంటూ పవన్ కళ్యాణ్ పై ఎదురు ప్రశ్నలు సంధిస్తూ, విమర్శలు చేసారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.