నేను అక్క‌డ పోటీ చేయ‌ను లోకేశ్ సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 15:15:31

నేను అక్క‌డ పోటీ చేయ‌ను లోకేశ్ సంచ‌ల‌నం

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేశ్ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని కొద్దికాలంగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వార్త‌ల‌పై స్పందించారు లోకేశ్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌నేది మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. అలాగే ఆయ‌న‌  హిందూపురం నుంచి పోటీ చేస్తార‌నే వార్త‌ల‌పై కూడా లోకేశ్ ఫైర్ అయ్యారు. 
 
తాను హిందూపురం నుంచి పోటీ చేయ‌న‌ని, గ‌తంలో తాను పోటీ చేస్తారంటూ వ‌చ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌ని లేకేశ్ స్ప‌ష్టం చేశారు. ఇదంతా కావాల‌నే త‌న‌పై రూమ‌ర్స్ పుట్టించి త‌న‌కు బాల‌కృష్ణ‌కు గొడ‌వ పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక దీంతో పాటు సొంత జిల్లా అయిన‌టువంటి చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి చంద్ర‌బాబు నాయుడు లోకేశ్ ను పోటీ చేయించి, ఆయ‌న టీడీపీ కంచుకోట కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఈ వార్త‌ల‌న్నింటిని లోకేశ్ ఖండించారు.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను ఎక్క‌డ నుంచి పోటీ చేయ‌మ‌ని ఆదేసిస్తే అక్క‌డ నుంచి పోటీ చేస్తాన‌ని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. టీడీపీ ప‌రిపాల‌న‌లో రాష్ట్ర ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిత్యం ప్ర‌జ‌ల సంక్షేమ‌మే త‌న స‌క్షేమం అని భావించి ప్ర‌తీ రోజు క‌ష్ట‌ప‌డ‌తార‌ని ఆయ‌న తెలిపారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీనే ధికారంలోకి వ‌స్తుంద‌ని లోకేశ్ త‌న ధీమాను వ్య‌క్తం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.