టాప్ హీరోయిన్ ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 17:13:28

టాప్ హీరోయిన్ ఫైర్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాల‌తో పాటు మిత్ర‌ప‌క్షాలు కూడా ఆయ‌న‌పై  విమ‌ర్శ‌లు చేస్తున్న‌సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వచ్చిన చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్దిలో ఆఖ‌రి స్థానాన్ని ద‌క్కించుకున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు... అలాగే చంద్ర‌బాబు నాయుడు దేశంలో త‌న‌కంటే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు లేర‌ని గ‌ర్వంగా చెప్పుకుంటార‌ని, అయితే ఆయ‌న సీనియారిటీ, న‌ల‌బై సంవ‌త్స‌రాల కుర్రాడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందు బెడిసికొట్టింద‌ని అంటున్నారు.
 
ఇక  ఇదే క్ర‌మంలో సినీ న‌టి, మాధ‌వీల‌త చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... ఈమె ఇటీవ‌లే హైద‌రాబాద్ లోని బీజేపీ కార్యాల‌యంలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ స‌మ‌క్షంలో బీజేసీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే..ఇక తాజాగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు ఆమె.
 
గ‌తంలో చంద్ర‌బాబు బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ కావాల‌న్నార‌ని, అయితే మ‌ళ్లీ ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కావాలంటున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. అలా పూట‌కొక మాటా మార్చుతున్న చంద్ర‌బాబు, మోడీ ని విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని అన్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించ‌ని నిధుల‌ను, మోడీ ఏపీకి కేటాయించార‌ని అన్నారు ఆమె. అయితే వాటిని అమ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు విఫ‌లం అయ్యార‌ని ఆమె విమ‌ర్శించారు.
 
2014 లో బీజేపీ అధికారంలోకి  వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఏపీకి నిధులు ఎంత కేటాయించిందో వాట‌న్నింటిని చంద్ర‌బాబు ఆధారాల‌తో స‌హా లెక్క చెప్పాల్సిందేనని స్ప‌ష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో భారీగా  అవినీతి జ‌రుగుతోంద‌ని ఆమె విమర్శించారు. దీంతో పాటు చంద్ర‌బాబు లారీ ఇసుక ఎగుమ‌తి చేస్తే  అక్ర‌మంగా ఐదు లక్షల రూపాయల బిల్లుల‌ను పెట్టుకుంటున్నారంటూ నిప్పులు చేరిగారు.
 
ఇక దీంతోపాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై స్పందించారు మాధ‌వీల‌త‌... తన చిన్నత‌నం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పెద్ద అభిమానినని తెలిపారు ఆమె. దేశ అభివృద్ది కోసం పాటుప‌డే బీజేపీ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, ఆ పార్టీ సిద్దాంతాలు న‌చ్చి తాను బీజేపీలో చేరాన‌ని అన్నారు.. అలాగే తాను పార్టీ ఆదేశిస్తే  ఎక్క‌డైనా ప్ర‌చారం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో పనిచేయాలనే కోరిక‌ ఉందని అన్నారు. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానంటూ, తన మనసులోని మాటను చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.