వైసీపీ ఎమ్మెల్యేపై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-09-18 12:58:25

వైసీపీ ఎమ్మెల్యేపై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు

వెల‌మా, కాపు, గౌర‌వ సామాజిక వ‌ర్గాలవారు ప్ర‌ధానంగా ఉండే విశాఖ జిల్లా మాడుగుల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా వెల‌మ‌ల‌దే ఆది ప‌త్య‌తం. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వెల‌మ శ్రీ 2004 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆత‌ర్వాత రెండె ఎన్నిక‌ల్లో వెల‌మ‌సామాజిక వ‌ర్గ నేత‌లే మాడుగుల ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో హోరా హోరిగా సాగిన ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గూడి ముత్యాల నాయుడు గెలిచారు. అయితే 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన రామానాయుడు 2014లో ఓడిపోవ‌డానికి  పార్టీ విభేదాలు కార‌ణం అయ్యాయ‌ని భావిస్తున్నారు.
 
ఎన్నిక‌లు ప్ర‌చారంలో తాను ఎమ్మెల్యే అయితే మాడుగుల‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తాన‌ని చెప్పిన ముత్యాల.. ఎమ్మెల్యే అయ్యాక ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా సొంత నిధుల‌ను వెచ్చించి నియోజ‌క‌వ‌ర్గంలో అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారు ఆయ‌న‌. సంక్షేమ‌ అభివృద్ది ప‌థ‌కాలు, నిధులు నియామ‌కాలు అన్నీ అధికార నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే  జ‌రుగుతున్నా కూడా ముత్యాల మాత్రం సొంత నిధుల‌ను వెచ్చించి చాలా చోట్ల అభివృద్ది కార్య‌క్రమాలు చేయించారు.
 
టీడీపీ ఇంచార్జ్ ప‌ద‌వితో పాటు మంత్రి అయ్య‌న్న పాత్రుడు అనుచ‌రుడిగా మాడుగుల‌లో రామానాయుడు చ‌క్రం తిప్పుతున్నారు. చుట్టూ డ్యాంలు ఉన్నా కూడా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు సాగునీటికోసం ఎదురు చూస్తున్న ప‌రిస్థితి. గ‌తంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీటిని అందంచే రైవాడ జ‌లాశ‌యం ఇప్పుడు విశాఖ న‌గ‌రానికి తాగు నీటిని అందిస్తోంది. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చెయ్యాల‌నుకున్నా కూడా టీడీపీ నాయ‌కులు ఆడ్డుకుంటున్నార‌నే ప్ర‌ధాన ప్ర‌తిపాధ‌న ఉంది. ఇక ఇదే జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరినా కూడా ముత్యాల నాయుడు మాత్రం వైసీపీలో ఉంటూ త‌న సొంత‌నిధుల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.