వైసీపీలో చేరిన ఈ మ‌హిళ ఎవ‌రో తెలుసా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-08-24 04:06:41

వైసీపీలో చేరిన ఈ మ‌హిళ ఎవ‌రో తెలుసా

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ఇటు రాజ‌య‌ల‌సీమకు చెందిన ప్ర‌జ‌లు అటు కోస్తాకు చెందిన టీడీపీ నాయ‌కులు అధినేత స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరుపేట నియోజ‌క‌ర్గానికి చెందిన విడ‌ద‌ల ర‌జిని, వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.
 
వేలాదిమంది కార్య‌క‌ర్త‌ల‌తో వ‌చ్చిన ఆమెకు జ‌గ‌న్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ త‌ర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జ‌గ‌న్ క‌ష్టాన్ని చూసి తాను వైసీపీలో చేరాన‌ని స్ప‌ష్టం చేశారు. వైఎస్ జ‌గ‌న్ అడుగులో అడుగు వేసి రాజ‌కీయ ప్రస్తానం సాగించ‌టం ఆనందంగా ఉంద‌ని ర‌జిని అన్నారు. 
 
ఈ రోజు మ‌హిళ‌లంద‌రికి ఆడ‌ప‌డుచుల‌కు శ్రావ‌ణ‌ శుక్ర‌వారం ఎంతో ప‌ర్వ‌దినం రోజు కాబ‌ట్టి త‌మ నియోజ‌క‌వ‌ర్గ మ‌హిళ‌లంద‌రూ వైసీపీలో చేరార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.