నిజంగా కేంద్రం ఆలోచించాల్సిందే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 06:08:32

నిజంగా కేంద్రం ఆలోచించాల్సిందే

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర  నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో కొనసాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా రేణ‌మాల‌లో మహిళా స‌ద‌స్సు ఏర్పాటు చేశారు. ఈ స‌ద‌స్సుకు పెద్ద ఎత్తున మ‌హిళ‌లు త‌ర‌లివ‌చ్చారు.
 
స‌ద‌స్సులో న‌వ‌ర‌త్నాల‌ను  వివ‌రించిన జ‌గ‌న్, మ‌హిళ‌లు చెప్పిన స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా విన్నారు. ఇందులో ఓ మ‌హిళ చెప్పిన స‌ల‌హా నిజంగా అద్భుత‌మైన‌ద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఉపాధి హామీప‌ధ‌కంలో మార్పులు కోరింది మ‌హిళ. 
 
ఉపాధి హామీ ప‌థ‌కం కింద క‌ల్పించే ప‌నిని, రైత‌న్న‌ల పొలాల్లో చేస్తే కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే డ‌బ్బుల‌తో పాటు రైతు కూడా అద‌నంగా కూలీ చెల్లిస్తారు.అప్పు డు పేద‌ల‌కు ఎక్కువ కూలీ వ‌స్తుంది.. ప‌ని ఉంటుంది.....దీంతో పాటు రైత‌న్న‌ల అవ‌స‌రాలు కూడా తీరుతాయంటూ మ‌హిళ, జ‌గ‌న్ కు స‌ల‌హా ఇచ్చింది.  
 
మ‌హిళ ఇచ్చిన స‌ల‌హాను వైయ‌స్ జ‌గ‌న్ మెచ్చుకున్నారు. అయితే, ప‌ని దొర‌క‌ని స‌మ‌యంలో పేద‌ల‌కు ప‌ని క‌ల్పించేందుకు ఉపాధీ హామీ ప‌థ‌కం యొక్క ముఖ్య ఉద్దేశ్యం....కావున మీరు చెబుతున్న దానిలో మార్పులు, చేర్పులు  కేంద్ర ప్ర‌భుత్వం చేతిలో ఉంటుంది....అయినా మీ స‌ల‌హాను స్వీక‌రించి కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళతామని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు....
 
మ‌హిళ చెప్పిన స‌ల‌హాపై కేంద్ర ప్ర‌భుత్వం నిజంగానే ఆలోచించాలి. ఉపాధి హామీ ప‌థ‌కం కార‌ణంగా గ్రామాల్లో పేద‌ల‌కు ప‌ని దొరుకుతుంది కాని, రైత‌న్న‌లు ప‌ని చేసే వారు దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఉపాధి హామీ ప‌థ‌కం కింద చేసే ప‌నులు  అన‌వ‌స‌ర‌మైన చోట చేయిస్తోంది ప్ర‌భుత్వం. అంతేకాకుండా ప‌నికి రాని వారిని కూడా వ‌చ్చిన‌ట్లు చూపించి వేల రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డుతున్నారు స్ధానిక నేత‌లు. నిజంగా ఈ ప‌థ‌కాన్ని రైతుల‌కు అనుసంధానం చేస్తే ఎంతో ఉపయోగ‌క‌రంగా ఉంటుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.