మ‌రో వైసీపీ అభ్య‌ర్ధి ఖ‌రారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-11 10:46:01

మ‌రో వైసీపీ అభ్య‌ర్ధి ఖ‌రారు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నిక‌ల‌కు  ఇప్ప‌టి  నుండే  అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తోంది. ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు సీట్ల‌లో అభ్య‌ర్ధుల‌ను క‌న్పామ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా మ‌రో అభ్య‌ర్ధిపై వైసీపీ సీనియ‌ర్ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.
 
 
 
ప్ర‌స్తుతం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. శ‌నివారం నాడు బోడగుడిపాడులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడుతూ...జ‌గ‌న్ ఆశీస్సుల‌తో ఎమ్మెల్యే ప్ర‌తాప్ రెడ్డి వచ్చే ఎన్నిక‌ల్లో మీ ముందుకు మ‌రోసారి వ‌స్తార‌ని, ఆశీర్వ‌దించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. 
 
 
జ‌గ‌న్ అవ‌కాశం ఇస్తే తాను కూడా వచ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తాన‌ని అప్పుడు కూడా త‌న‌కు ఒక ఓటు వేయాల‌ని మేక‌పాటి కోరారు.  స‌భ‌లో జగన్‌ సమక్షంలోనే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిని ఆశీర్వదించాలని మేకపాటి కోర‌డం  ద్వారా వచ్చే ఎన్నికల్లో కావలి వైసీపీ అభ్యర్థిగా మరోసారి ప్రతాప్‌ కుమార్ రెడ్డి బ‌రిలో దిగ‌నున్న‌ట్లు స్ప‌ష్టం అయింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.