వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 15:18:47

వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో వ‌ల‌సలు పెర‌గ‌డం పార్టీలోచేరేందుకు నాయ‌కులు ఉత్సాహం చూప‌డంతో ఇప్పుడు వైసీపీలో కొత్తహుషారు వ‌స్తోంది.. ఇక తాజాగా గుంటూరు జిల్లా నుంచి వైసీపీలోకి బీజేపీ నాయ‌కుడు మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయణ చేరుతున్న సంద‌ర్బంగా వైసీపీలో కొత్త హుషారు వ‌స్తోంది.. ఆయ‌న గుంటూరు నుంచి నిలుచుంటారా లేదా పెద‌కూర‌పాడు నుంచి నిలుచుంటారా అని అప్పుడే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి ...ప్ర‌జ‌ల్లో ఇక న‌ర‌స‌రావు పేట ఎంపీగా ఆయ‌న నిల‌బ‌డినా ఆశ్య‌ర్యం లేదు అంటున్నారు జిల్లా ప్ర‌జలు.
 
అయితే ఈ సంద‌ట్లో తాజాగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీసీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌ నాయుడు అన్నారు. తాజాగా ఆయ‌న త‌న కేడ‌ర్ తో ఈ విష‌యం వెల్ల‌డించారు జ‌గ‌న్ ఆశీస్సులు నాకు ఉన్నాయి అని ఆయ‌న వెల్ల‌డించారు.
 
మూడు సంవత్సరాల క్రితం పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా జగన్మోహన్‌రెడ్డి తనను నియమించారన్నారు. పార్టీ పిలుపు మేరకు గడపగడపకు వైసీపీ, పల్లెనిద్ర, రచ్చబండ, పార్టీ ప్లీనరీ, నవరత్నాల సభను, ప్రత్యేకహోదా ఉద్యమాలను నిర్వహించామన్నారు.... సెగ్మెంట్లో ప్ర‌జ‌ల్లో త‌న‌కు మంచి పేరు ఉంద‌ని ఆయ‌న అన్నారు తెలుగుదేశం అక్ర‌మాల‌ను నియోజ‌క‌వ‌ర్గం లో ప్ర‌జ‌ల్లోకి మ‌రింత బ‌లంగా తీసుకువెళ్లాన‌ని ఆయ‌న అన్నారు.
 
ఇక జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఎంత పేరు వ‌చ్చిందో అలాగే  పెదకూరపాడులో నిర్వహించిన జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు మ‌రింత పేరు వ‌చ్చింది అని జ‌గ‌న్ యాత్ర‌ను ఇక్క‌డ విజ‌యవంతంగా  చేశామన్నారు. వైఎస్సార్‌సీపీలో రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, వారి అనుచరులు పార్టీలో చేరడాన్ని నిండు మనస్సుతో వారికి స్వాగతం పలుకుతున్నామన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.