ప్ర‌ముఖ నటి వైసీపీ త‌రపున పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 02:48:59

ప్ర‌ముఖ నటి వైసీపీ త‌రపున పోటీ

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార పార్టీ నాయ‌కులు ఇంటింటికి తెలుగు దేశం పేరుతో ప‌లు చోట్ల  ప్ర‌చారం చేస్తున్నారు....మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రానున్న ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా  ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే... ఈ సంక‌ల్ప యాత్ర‌లో టీడీపీ నాయ‌కులు చేస్తున్న అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ, ఈ యాత్ర‌లో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
జ‌గ‌న్  త‌ల‌పెట్టిన ఈ  ప్ర‌జా సంక‌ల్పయాత్ర త‌న సొంత జిల్లా క‌డ‌ప నుంచి మొద‌లుపెట్టి, నేడు నెల్లూరు జిల్లా కావ‌లి సెగ్మెంట్ లో కొనసాగుతోంది...ఇక  2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్  పార్టీ త‌రపున గెలిచి,  అధికార పార్టీ అండ‌తో వైసీపీ నుంచి పార్టీ  ఫిరాయించిన నాయ‌కుల‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చెక్ పెడుతున్నారు.
 
పార్టీ ఫిరాయించిన ఎంపీ, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ యాత్ర పెద్ద గుణ‌పాఠంగా మారుతోంది... ఇడుపుల‌పాయలో మొద‌లు పెట్టిన‌ ఈ ప్ర‌జా సంక‌ల్పపాద‌యాత్రకు  అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి కొంద‌రు సినీన‌టులు కూడా పార్టీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.
 
ఈ క్ర‌మంలో కొంత‌మంది స్టార్ సెల‌బ్రిటీలు జ‌గ‌న్ అవ‌కాశం ఇస్తే, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ త‌రపున పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది... అయితే ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అగ్ర న‌టీ  న‌టులు రాజకీయ అరంగేట్రం చేయ‌గా, వీరి బాట‌లోనే న‌డిచేందుకు,  తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన  ప్ర‌ముఖ న‌టి రాజ‌కీయాల‌పై  ఆస‌క్తి చూపుతున్నారని తెలుస్తోంది.
 
కొద్ది రోజుల క్రితం మోహ‌న్ బాబు రానున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రపున పొటీ చేయ‌నున్నార‌నే వార్త  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే... తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోగా కొన‌సాగుతున్నారు న‌టుడు మోహ‌న్ బాబు... తన న‌ట‌న‌తో, డైలాగ్స్ తో తెలుగు ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తూ కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు.. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు న‌ట‌న‌లోనే,  కాకుండా గ‌తంలో రాజ‌కీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం మోహ‌న్ బాబు రానున్న ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌నుకున్నాడ‌ట‌... త‌న స్థానంలో రాజ‌కీయ వార‌స‌త్వాన్ని మంచు ల‌క్ష్మికి ఇచ్చిన‌ట్లు స‌మాచారం.. అయితే త‌న తండ్రి కోరిక మేర‌కు ల‌క్ష్మి  వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ త‌రుపున పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌.
 
ఈ నేప‌థ్యంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆమెను అంగీక‌రిస్తే, త‌న సొంత జిల్లా చిత్తూరులోని  శ్రీకాళ‌హ‌స్తి సెగ్మెంట్  నుంచి పోటీ చేసెందుకు ల‌క్ష్మి సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.