దేవుడి మీద ఒట్టు నేను వైసీపీలో చేరుతున్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 14:51:10

దేవుడి మీద ఒట్టు నేను వైసీపీలో చేరుతున్నా

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ముంద‌స్తు రాజ‌కీయాలను దృష్టిలో ఉంచుకుని మ‌న‌ నాయ‌కులు గోడ‌లు దూకుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది. తాము పార్టీలోకి ఫిరాయిస్తే రాజ‌కీయంగా మ‌ర్యాద‌ ద‌క్కుతుందా లేదా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఎమ్మెల్యే సీటు క‌న్ఫామ్ చేస్తారా అని కొంద‌రు రాజ‌కీయ కీల‌క నాయ‌కులు ఆచి తూచి అడుగులు వేస్తూ ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు.
 
మ‌రోవైపు ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికాంలోకి రాక‌పోతే రాజ‌కీయ మ‌నుగుడ దెబ్బ తింటుంద‌నే ఉద్దేశ్యంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.2014 ఎన్నిక‌ల్లో ఏ జిల్లాలో అయితే వైసీపీ ప‌ట్టు సాధించ‌లేక పోయిందో ఆ జిల్లాలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా కొత్త‌ స్ట్రాట‌జీని వేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉభ‌య గోదావరి జిల్లాల్లో జ‌గ‌న్ స్ట్రాట‌జీ నూటకి నూరు శాతం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ స్ట్రాట‌జీని చూసిన కొంద‌రు నాయ‌కులు వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
తాజాగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీ లోకి చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. అందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేశారు. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో మానుగుంట మహీధర్ రెడ్డి మ‌రో రెండు రోజుల్లో అంటే ఈ నెల 11 వ‌తేదిన వైసీపీ తీర్థం తీసుకోనున్నార‌ని ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశాల్లో తెలిపారు. ఆయన పార్టీలో చేరేందుకు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్ కీల‌క పాత్ర‌ వ్య‌వ‌హ‌రించారు.
 
ఇదిలా ఉంటే మానుగుంట మహీధర్ రెడ్డి ప్ర‌కాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగారు. గతంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్ర‌కాశంలో జిల్లాలో పోటీచేసి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమారెడ్డి హ‌యాంలో కూడా క్యాబినెట్ పుర‌పాల‌క శాఖ మంత్రిగా బాధ్య‌లు స్వీకరించారు. ఆ త‌ర్వాత 2014లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌లకు అలాగే రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. గ‌తంలో మానుగుంట మహీధర్ రెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ టీడీపీ లోకి చేర‌లేదు. 
 
ఈ క్ర‌మంలో వైసీపీలో చేరుతార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి కానీ ఆ విష‌యంపై స్పందించ‌లేదు ఆయ‌న. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఎలాగైనా మానుగుంటని వైసీపీలోకి తీసుకురావాల‌నే క్ర‌మంలో పార్టీ నాయ‌కులు ఆయ‌న‌తో మంత‌నాలు జ‌రిపారు. ఈ మంత‌నాలు జ‌రిగిన త‌ర్వాత వైసీపీ తీర్థం తీసుకుంటాన‌ని చెప్పారు. అంతేకాదు రాజ‌కీయంగా కాకుండా ఆయ‌న‌కు దేవుడి భ‌క్తి కూడా ఎక్కువ‌.  నిత్యం సాయిబాబును పూజిస్తారు, అలాంటి వ్య‌క్తి సాయి బాబా మీద ఒట్టు వేసి వైసీపీ తీర్థం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

1 Comment

  1. It is heard that Balineni Srinivasa Reddy and YV Subba Reddy are not happy with his joining in YCP. Is it true or false. Please confirm.

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.