గిడ్డి ఈశ్వరి కి మావోయిసులు చంపేస్తామని లేఖ..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

giddi eswari
Updated:  2018-10-10 17:47:08

గిడ్డి ఈశ్వరి కి మావోయిసులు చంపేస్తామని లేఖ..

మరో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ని మావోయిస్టులు టార్గెట్ చేసారు.. రెండు నెలల తర్వాత కిడారి ని చంపిన రీతిలోనే ఆమెను హత్య చేస్తామని ఓ లేఖలో స్పష్టంగా గడువు విధించడంతో గిడ్డి లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. వైసిపి తరపున విశాఖ పట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో గెలిచినా గిడ్డి ఈశ్వరి 20 కోట్లు తీసుకుని టీడీపీ లో జాయిన్ అయినా విషయం తమకు తెలుసనీ ఆమెను తుదిముట్టించడం ఖాయం అన్నారు..

కిడారి ని చంపే సమయంలో ప్రజా కోర్టు పేరుతో గిరిజనుల సమక్షంలో కిడారిని వివరాలడిగి సేకరించగా, ఫిరాయింపునకు 12 కోట్లు తీసుకున్నానని అంగీకరించగా, అక్కడ గిడ్డి ఈశ్వరి ప్రస్తావన కూడా రాగ టీడీపీ లోకి వెళ్లేందుకు మంత్రి పదవి హామీతో పాటు 20 కోట్లు తీసుకున్నారని లేఖలో మావోయిసులు పేర్కొన్నారు..  కిడారి చెప్పారని మావోయిస్టులు లేఖలో చెబుతున్న ప్రకారమే టిడిపిలోకి వెళ్ళేందుకు గిడ్డి మంత్రి పదవి హామీతో పాటు రూ 20 కోట్లు తీసుకున్నారట. అని ప్రచారం బయట కూడా ఉండడంతో ఇది నిజమే అనిపిస్తుంది..

అయితే రెండు నెలల్లో ఈశ్వరి తీసుకున్న 20 కోట్లు గిరిజనులకు పంచాలని, బాక్సయిట్ గనుల తవ్వకాలను వ్యతిరేకించాలని చెప్పారు. ఇవన్నీ రెండు నెలల్లో చేయకపోతే గిడ్డిని కూడా కిడారిని చంపినట్లే చంపేస్తామని హెచ్చరించారు.. ఇవన్నీ 2 నెలల్లోపల చేయకపోతే గిడ్డిని కూడా కిడారిని కాల్చి చంపేసినట్లే చంపుతామంటూ హెచ్చరించటంతో ఫిరాయింపు ఎంఎల్ఏల్లో టెన్షన్ పెంచేస్తోంది. మొన్న కిడారి హత్య జరిగిన దగ్గర నుండి గిడ్డిలో కూడా ప్రాణభయం మొదలైందన్నది వాస్తవం.

మావోయిస్టులు ప్రధానంగా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. కిడారైనా, గిడ్డైనా వైసిపిలో ఉన్నంత కాలం బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళే. ఎప్పుడైతే టిడిపిలోకి ఫిరాయించారో తర్వాత వాళ్ళ స్టాండ్ మారిపోయింది. దాని వల్లే కిడారి మావోయిస్టుల తుపాకులకు గురయ్యాడు. మరి మావోయిస్టుల తాజా హెచ్చరికలతో గిడ్డి ఏం చేస్తుందో చూడాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.