చంద్ర‌బాబుకు లేఖ రాస్తూ మావోయిస్టులు హెచ్చ‌రిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-11-06 10:41:44

చంద్ర‌బాబుకు లేఖ రాస్తూ మావోయిస్టులు హెచ్చ‌రిక‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు తాజాగా మావోయిస్టులు హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేస్తూ లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజ‌నుల‌ అక్ర‌మ అరెస్టుల‌కు సంబంధించి టీడీపీ ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని మావోయిస్టులు డిమాండ్ చేశారు.
 
మావోయిస్టుల‌ లేఖలోని సారాంశం... ప్ర‌స్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో కొన‌సాగుతున్న అక్ర‌మ అరెస్టుల‌కు నిర్భంద‌ కాండ‌కు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఇందుకు త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామ‌ని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతాన‌ని ప‌లుకుతున్న చంద్ర‌బాబు నాయుడు న‌క్క జిత్తుల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు ఎవ్వ‌రు న‌మ్మ‌ర‌ని తెలిపారు. 
 
ప్ర‌స్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ పేరుతో గ్రామాల మీద దాడులు చేస్తున్నార‌ని ఆ దాడిలో గిరిజ‌న యువ‌కుల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేస్తున్నార‌ని మావోయిస్టులు మండిప‌డుతున్నారు. ఏజెన్సీ గిరిజ‌న ప్ర‌జ‌లు అడ‌వుల‌ను న‌మ్ముకుంటార‌ని ప్ర‌స్తుతం ఆడ‌వి బిడ్డ అదే అడ‌వికి వెళ్లాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి టీడీపీ స‌ర్కార్ నాయ‌కులు తీసుకువ‌చ్చార‌ని మండిప‌డ్డారు.
 
అంతేకాదు అక్టోబ‌ర్ 15, 26 తేదీల‌ల్లో అర్థ‌రాత్రి దాడి చేసి న‌లుగురు గిరిజ‌నులను అరెస్టు చేసి ప‌ట్టుకెళ్లార‌ని ఈ అరెస్టుకు అడ్డు వ‌చ్చిన మ‌హిళ‌ల‌ని చూడ‌కుండా చిత‌క‌బాదార‌ని వారు హెచ్చ‌రించారు. జిల్లా వ్యాప్తంగా ఏ మండ‌లాల్లో గిరిజ‌నుల‌ను నిర్భందించినా ఆ జిల్లా స్థాయి నాయ‌కుడు త్వ‌ర‌లో త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment