టీడీపీని వీడ‌టంపై ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-31 14:14:40

టీడీపీని వీడ‌టంపై ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున క్లారిటీ

కొద్ది కాలంగా అధికార తెలుగుదేశం పార్టీ క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి పార్టీ నాయ‌కుల‌పై, అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అసంతృప్తితో ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు జిల్లా టీడీపీలో నెల‌కొన్న కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త్వ‌ర‌లో పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల గురించి మేడా మ‌ల్లికార్జున స్పందించారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో  మాట్లాడుతూ, కొద్దిరోజుల నుంచి తాను పార్టీ వీడుతున్నానంటూ వ‌స్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని కొంద‌రు జిల్లా టీడీపీ నాయ‌కులు త‌న‌పై ద‌ష్ప్రచారం చేసి పార్టీ నుంచి వైదొలిగించేలా చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వారు చేస్తున్న వ‌దంతువుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని త‌న అనుచ‌రుల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మేడా సూచించారు.
 
అంతేకాదు ఈ రాజీనామా పంచాయితీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్లింది. ఇక ఈ వ‌దంతుల నేప‌థ్యంలో మేడా మ‌ల్లికార్జున‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఫోన్ చేసి వెంట‌నే త‌న‌ను క‌ల‌వాల‌ని సూచించారు. పార్టీ అధినేత సూచ‌న‌ల మేర‌కు మేడా, శ్రీనివాసులురెడ్డి, ఇతర నేతలతో క‌లిసి సీఎం కార్యాలయంలో చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. ఆ త‌ర్వాత జిల్లా టీడీపీలో జ‌రుగుతున్న రాకీయాల‌ను వివ‌రించారు మేడా. అంతేకాదు తాను రాజీనామా చేస్తున్నాన‌ని కూడా ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర వివ‌రించారు. 
 
తాను చిన్న చిన్న స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోన‌ని కాని జిల్లా నాయ‌కులు ఈ విష‌యాల‌ను సీరియ‌స్ గా తీసుకుని త‌న‌పై లేనిపోని నింద‌లు వేస్తున్నార‌ని ఆయ‌న చంద్ర‌బాబుకు వివ‌రించారు. తాను ఎట్టి ప‌రిస్థితిలో టీడీపీని వీడ‌న‌ని చంద్ర‌బాబుకి స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.