ఆర్కే శ్రీనిరాజు సంచ‌ల‌న నిర్ణ‌యం?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-21 13:04:36

ఆర్కే శ్రీనిరాజు సంచ‌ల‌న నిర్ణ‌యం?

శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ నుంచి  ఈ వివాదం ప‌వ‌న్ పై ప‌ద‌ప్ర‌యోగం చేయ‌డం నుంచి  వ‌ర్మ వ‌ద్ద‌కు వెళ్లింది.. అక్క‌డ  వ‌ర్మ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇక ఈ వివాదం పొలిటిక‌ల్ గా ప‌వ‌న్ పైకి తీసుకువ‌చ్చారు.. ఇద్ద‌రు మీడియా అధిపతుల పేర్లు బ‌య‌ట‌పెట్టారు ప‌వ‌న్... అలాగే టీవీ9 అధినేత శ్రీనిరాజు, ఏబీఎన్ ఆర్కే, టీవీ9 ర‌విప్ర‌కాశ్ పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టారు జ‌న‌సేనాని. ఇక వీరిపై ట్వీట్లు ఫోటోలు పెడుతూ మండిప‌డుతున్నారు.
 
దీంతో నిన్న ఫిలిం చాంబ‌ర్ వ‌ద్ద ఏబీఎన్ వాహానం పై ప‌వ‌న్ అభిమానులు దాడి చేసి విధ్వంసం చేశారు.. అయితే  లైవ్ క‌వ‌రేజీకి వ‌చ్చిన ఏబీఎన్‌ ఛానల్ లైవ్ వ్యాన్‌, కారును ధ్వంసం చేయ‌డం తో,  ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌ర్య‌ల వ‌ల్ల ఇలా జ‌రిగింది అని ఆర్కే మండిప‌డుతున్నారు.. ఈ ప‌రిణామం పై  ఏబీఎన్ రాధాకృష్ణ చాలా ఆగ్రహంగా ఉన్నారట.
 
పవన్‌ కల్యాణ్‌పై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.ఆయనపై క్రిమినల్‌ కేసు పెట్టడంతోపాటు రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు అని తెలుస్తోంది.. ఇక నిజాలు తెలుసుకోకుండా త‌న‌పై ఇష్టం వ‌చ్చిన రీతిలో ఫోటోలు ట్విట్ట‌ర్ల‌లో పెట్టి ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న ప‌వ‌న్ పై పరువు నష్టం దావా వేయాలని శ్రీనిరాజు కూడా నిర్ణయించారట.
 
అయితే ప‌వ‌న్ విష‌యంలో ఏబీఎన్ వాద‌న వేరుగా ఉంది.. ఆయ‌న త‌ల్లి పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను తాము మ్యూట్ చేసి ప్ర‌సారం చేశామ‌ని మిగిలిన వారు అలా ప‌ద్ద‌తి పాటించ‌లేదు అని ఏబీఎన్ చెప్పుకొస్తోంది. ఇక టీవీ9 కూడా దీనిపై న్యాయ‌పోరాటానికి సిద్దం అవుతోంది రుజువులు లేకుండా ప‌వ‌న్ ఆరోప‌ణ‌లు చేస్తే  ఊరుకోము అని అంటున్నారు మీడియా అధినేత‌లు.. ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ ఇటువంటి నిర్ణ‌యం మీడియాతో త‌గువులు పెట్టుకోవ‌డం అంత శ్రేయ‌స్క‌రం కాదు అని విశ్లేష‌కుల సూచ‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.