చంద్ర‌బాబు సంసారం పై మేక‌పాటి స‌టైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 02:50:53

చంద్ర‌బాబు సంసారం పై మేక‌పాటి స‌టైర్

ప్ర‌త్యేక హూదా ఏమైనా సంజీవ‌నా అని అంటారు తెలుగుదేశం నాయ‌కులు.. అదే పందాలో మాట్లాడ‌తారు పార్టీ అధినేత చంద్ర‌బాబు..ప్ర‌త్యేక హూదా కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంతో వైసీపీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు... అలాగే వైసీపీ ఎంపీలు తాము రాజీనామాల‌కు ఎప్పుడైనా సిద్దం అంటున్నారు.
 
ప్ర‌త్యేక హూదా కోసం, ఏపీ ప్ర‌జ‌ల కోసం తాము రాజీనామాలు చేయ‌నుండ‌డం చాలా గ‌ర్వంగా ఉంది అన్నారు, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి... ఇలా ప్ర‌జ‌ల‌కోసం రాజీనామా చేసి వారికోసం ప్రజాక్షేత్రంలో నిల‌బ‌డ‌టం త‌మ‌కు ఎంతో సంతృప్తిని క‌లిగిస్తుంది అన్నారు.
 
అలాగే గ‌తంలో వైయ‌స్సార్ పేరును ఎఫ్ ఐఆర్ లో పెట్టిన స‌మ‌యంలో కూడా రాజీనామా చేశాన‌ని, ఆయ‌న తెలియ‌చేశారు.. గ‌తంలో త‌న‌పై పోటీకి సుబ్బ‌రామిరెడ్డిని నిలిపార‌ని, కాంగ్రెస్ చేసిన విధానాన్ని తెలియ‌చేశారు ఆయ‌న‌...రాష్ట్రంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి కేంద్రంలో సోనియా కూడా ఆయ‌న‌కు  సాయం చేశార‌ని, కాని తాను పైసా ఖ‌ర్చు చేయ‌క‌పోయినా ప్ర‌జ‌లు న‌న్ను గెలిపించార‌ని అన్నారు మేక‌పాటి.
 
జ‌గ‌న్ లాంటి నైతిక విలువ‌లు క‌లిగిన నాయ‌కుడు వెంట ఉన్నందుకు గ‌ర్వ ప‌డుతున్నాము అన్నారు ఆయ‌న‌. ఇక చంద్ర‌బాబు పై స‌టైర్ వేశారు ఆయ‌న‌.. చంద్ర‌బాబు సొంత సంసారం చూసుకోవ‌డం మానేసి ప‌క్క‌వారి సంసారం గురించి ఆలోచించే వ్య‌క్తి అన్నారు ఆయ‌న‌.
 
పార్టీలో నాయ‌కులు ఉన్నా, అధికార పార్టీకి స‌రియైన కోర‌మ్ సంఖ్య ఉన్నా ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను ముగ్గురు ఎంపీల‌ను పార్టీ ఫిరాయించేలా చేయ‌డం పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.. సిగ్గు లేని రాజ‌కీయాలు చేయ‌డం జ‌గ‌న్ కు చేత‌కాదు అని అన్నారు... ఎక్క‌డైనా భార్యభర్తల‌కు వివాదం వస్తే విడాకులు ఇచ్చి విడిపోతారు.. చంద్రబాబు మాత్రం విడాకులు కూడా ఇవ్వకుండా పక్కవారితో కాపురం చేయాలని భావించే వ్యక్తి అని మేకపాటి ఫైర్ అయ్యారు..
 
ఇక ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ను ఎలా ఎమ్మెల్సీగా తీసుకున్నారో, ఎమ్మెల్సీ ప‌ద‌వి నుంచి మంత్రి ప‌ద‌వి ఎలా క‌ట్ట‌బెట్టారో అంద‌రికి తెలుసని అన్నారు...అంటే ఆయ‌న కుమారుడికి ప‌ద‌వులు రావాలి అని కోరుకున్న‌ట్లే, రాష్ట్రంలో ప్ర‌తీ త‌ల్లి దండ్రులు కూడా త‌మ పిల్ల‌ల‌కు ఉద్యోగాలు రావాలి అని కోరుకోకూడదా అని ప్ర‌శ్నించారు. అంటే మీకో న్యాయం, ప్ర‌జ‌ల‌కు ఓ న్యాయమా అని ప్ర‌శ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.