బాబును అడ్డంగా బుక్ చేసిన మంత్రి ఆది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 12:30:44

బాబును అడ్డంగా బుక్ చేసిన మంత్రి ఆది

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని మ‌రోసారి అడ్డంగా ఇరికించేశారు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. త‌మ ఎంపీలు మార్చి 5న రాజీనామాలు చేస్తారంటూ వైసీపీకి కౌంట‌ర్ ఇవ్వ‌డంలో మంత్రి ఆది ఇటీవ‌ల అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన  విష‌యం తెలిసిందే.
 
త‌మ‌కు అవినీతి చేసుకోమని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే చెప్పారంటూ ఆది నారాయ‌ణ  రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను చేసిన అవినీతిలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ రామ‌సుబ్బా రెడ్డికి అర్ధ‌రూపాయి భాగం ఉంద‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. 
 
ఎవ‌రు ఎన్ని విమర్శ‌లు చేసినా తాను ప‌ట్టించుకోన‌ని, స్వ‌యానా సీఎం చంద్ర‌బాబు నాయుడే ఐఏఎస్ ఆఫిస‌ర్ల స‌మ‌క్షంలో వాటాల‌పై పంచాయ‌తీ చేశారంటూ.... ఆది అస‌లు నిజాన్ని బ‌య‌ట‌పెట్టారు. రామ‌సుబ్బారెడ్డి అడిగిన వాటిలో కూడా మ‌న‌కు సగం వ‌స్తుంద‌ని ఆయ‌న నిర్మొహ‌మాటంగా కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో చెప్పారు. 
 
మీరు కూడా ఎవ‌రినీ విమ‌ర్శించ‌కండీ... మీకు కావాల్సిన పనులు నన్ను అడ‌గండి..ఎస్ ఎం ఎస్ లు పెట్టండి...అంటూ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఓ వ్య‌క్తి వీడియో తీయ‌డం ద్వారా బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.