అఖిలప్రియ పేరు తొలగింపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

minister akhila priya and av subba reddy
Updated:  2018-04-23 14:49:49

అఖిలప్రియ పేరు తొలగింపు

త‌ర‌త‌రాల‌ నుండి కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసిస్తోంది భూమా ఫ్యామిలీ...అయితే  కొద్ది రోజుల క్రితం  శోభా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి,అకాల మరణం తర్వాత ఎన్న‌డూ లేని విధంగా నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయాల్లో ఆధిపత్యపోరు కొనసాగుతోంది.. ముఖ్యంగా భూమాకు న‌మ్మిన బంటు, ప్ర‌ధాన అనుచ‌రుడుగా వ్య‌వ‌హ‌రించిన ఏవీ సుబ్బారెడ్డికి శోభా నాగిరెడ్డి కుమార్తె  ఫిరాయింపు ఎమ్మెల్యే టీడీపీ ప‌ర్యాట‌క శాఖా మంత్రి అఖిల ప్రియల‌ మ‌ధ్య వ‌ర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్న సంగ‌తి తెలిసిందే.
 
గ‌తంలో వీరిద్ద‌రి విభేదాల వ‌ల్ల ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయ ప‌రిస్థితి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు దృష్టికి వెళ్లింది... అయితే వీరిద్ద‌రి విభేదాల‌ను చంద్ర‌బాబు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు.... ఈ విభేదాల మ‌ధ్య‌ గ‌తంలో  ఏవీ సుబ్బారెడ్డి పార్టీ మార‌తార‌ని అంద‌రూ భావించారు.. దీంతో వెంట‌నే చంద్ర‌బాబు సుబ్బారెడ్డిని అమ‌రావ‌తికి రావాల‌ని ఆదేశించారు.... ఆళ్ల‌గ‌డ్డ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిస్థితులును చంద్ర‌బాబుకు వివ‌రించారు... దీంతో ఆయ‌న సానుకూలంగా స్పందించి సుబ్బారెడ్డికి న‌చ్చ‌చెప్పి పంపించారు.
 
అయితే చంద్రబాబు పిలిచి మాట్లాడిన  కొద్ది  రోజులకే ఎదో ఒక రూపంలో సుబ్బా రెడ్డి,  మంత్రి అఖిల‌ ప్రియ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి...ఇంతకు ముందు కూడా భూమా వర్థంతికి తనని పిలవలేదని సుబ్బా రెడ్డి అఖిల ప్రియపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
ఇక తాజాగా ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్‌ ర్యాలీని చేపట్టారు... ఆదివారం ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు రాళ్లతో దాడి చేశారు... ఈ దాడిలో సుబ్బారెడ్డికి ఆయ‌న అనుచ‌రుడికి గాయాలు అయ్యాయి... దీంతో వారిని వెంట‌నే స్థానిక ఆసుప‌త్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు.. ఆ వెంటనే సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. 
 
త‌న‌పై మంత్రి అఖిల ప్రియ త‌న అనుచ‌రుల‌తో దాడి చేయిస్తోందని ఆమె పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. ఈ దాడిలో మంత్రి  అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడంతో ఏవీ వర్గీయులు మండిప‌డుతున్నారు..దీంతో అక్క‌డ ఉద్రిక్త పరిస్థి ఏర్ప‌డింది... పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేప్రయత్నం చేస్తున్నారని సుబ్బారెడ్డి  కేడ‌ర్ ఆరోపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.