మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మరో వార్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 15:49:19

మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మరో వార్ ?

వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి క‌ర్నూలు జిల్లాలో మంత్రి ప‌ద‌వి కూడా పొందింది భూమా కుటుంబం... అయితే భూమా వార‌సురాలిగా ఉన్న అఖిల ప్రియకు  తండ్రి మ‌ర‌ణంతో రాజ‌కీయంగా ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురుఅవుతున్నాయి. ఆళ్ల‌గ‌డ్డ నంద్యాల రెండు సెగ్మెంట్ల‌లో రాజ‌కీయంగా భూమా కుటుంబానికి ఎంతో కీర్తి ఉంది.
 
కాని భూమా నాగిరెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడుగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో  మంత్రి అఖిల ప్రియ‌కు పొస‌గ‌డం లేదు అనే వార్త‌లు ఈ మ‌ధ్య బాగా వినిపిస్తున్నాయి.. అయితే పార్టీలో త‌న‌కు గుర్తింపు, స‌రైన గౌర‌వం ఇవ్వ‌డం లేదు అని ఆయ‌న స‌న్నిహితులు తెలియ‌చేస్తున్నారు.
 
ఇప్ప‌టికే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై త్వ‌రలో ఆయన ప్ర‌క‌ట‌న చేస్తారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.. ఇటు ఆస్తుల గురించి అనేక వివాదాలు ఇరువురి మ‌ధ్య వ‌చ్చాయి అంటున్నారు.. అయితే మ‌రోసారి వీరి ఇరువురి మ‌ధ్య రాజ‌కీయంగా ముస‌లం ఏర్ప‌డింది.
 
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి...ఆళ్లగడ్డలో ఏవీ హెల్ప్‌లైన్‌ను ఏవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేశారు. అయితే... ఈ హెల్ప్‌లైన్ ప్రారంభోత్సవానికి భూమా వర్గీయులు వెళ్లకుండా మంత్రి అఖిలప్రియ అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. దీంతో పార్టీలో మ‌రింత వార్ పెరిగింది రాజ‌కీయంగా వీరి ఇరువురి మ‌ధ్య ఎప్పుడూ  స‌యోధ్య కుదురుతుంది అని త‌మ్ముళ్లు డైల‌మాలో ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.