అఖిల ప్రియ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-09 15:30:38

అఖిల ప్రియ క్లారిటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతున్నాయా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే క‌ర్నూల్ జిల్లాలోని రాజ‌కీయం నిప్పు-ఉప్పులా మారుతోంది. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో  వైసీపీనే అత్య‌ధిక మెజారిటీతో గెలిచింది. ఇక టీడీపీ అయితే  కేవ‌లం మూడు స్థానాల‌కే ప‌రిమితం అయింది. 
 
ఆ త‌ర్వాత అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌ ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి వైసీపీ నాయకులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. వారు సైకిల్ తీర్థం తీసుకున్న త‌ర్వాత సంవ‌త్స‌రం పాటు సాఫీగానే కాపురం సాగించారు. ఇక ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో క‌ర్నూల్ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు టికెట్ భయం పుడుతోంద‌ని వార్తలు వ‌స్తున్నాయి.
 
ఇక ఈ వ‌రుస‌లో ఆళ్ల‌గ‌డ్డ పిరాయింపు ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియ ముందంజ‌లో ఉన్నారు. కొద్ది కాలంగా టీడీపీ నాయ‌కులు ఏవీ సుబ్బారెడ్డితో మంత్రి అఖిల ప్రియ వైర్యం కొన‌సాగిస్తూనే ఉంది. ఇక వీరిద్ద‌రి వైర్యానికి అమ‌రావ‌తి ప్ర‌థ‌మ ఘ‌ట్టంగా మారినా కూడా 24 గంటలు గ‌డువ‌క ముందే మంత్రి అఖిల ప్రియ త‌న అనుచ‌రుల‌తో ఏవీ పై అటాక్ చేయిస్తూనే ఉంది. 
 
ఇక‌ ఇదే క్ర‌మంలో బ‌న‌గానప‌ల్లె టీడీపీ ఎమ్మెల్యే, అఖిల ప్రియ‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు. దీంతో మ‌రోసారి చంద్ర‌బాబు ఆమెను అమ‌రావ‌తి పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఇక ఈ వివాదాల‌తో అఖిల టీడీపీలో అసంతృప్తితో ఉన్నారని ఆమె పార్టీని వీడటం ఖాయమని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో తాను పార్టీలో కొనసాగలేనని ఎన్నికల కల్లా వైసీపీలోకి వస్తానని స్వయాన వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
ఇక తాజాగా త‌న‌పై వ‌స్తున్న వార్త‌లపై అఖిల ప్రియ స్పందించారు. ఈ స‌ద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల్లో ఎటాంటి వాస్త‌వం లేద‌ని అన్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కచ్చితంగా టీడీపీ త‌ర‌పున పోటీ చేసి తీరుతాన‌ని అన్నారు. అయితే పార్టీ త‌ర‌పున టిక్కెట్ ఎవరికివ్వాలన్నది చంద్ర‌బాబు ఇష్టం అని అన్నారు. అంతే కాదు ముఖ్య‌మంత్రి హామీ ఇస్తే తాను ఎక్క‌డ నుంచి అయినా పోటీ చేస్తాన‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.